ప్రజా ప్రతినిధులకు ఫేస్ యాప్ ఎందుకు ప్రవేశ పెట్టరు?: లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ తక్షణమే రద్దు చేయాలి ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్మును లక్షల రూపాయలు జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులకు, ప్రజా ప్రతినిధులకు ఫేస్ యాప్ ఎందుకు ప్రవేశ పెట్టరు? ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే అవినీతి యాప్ ప్రవేశపెట్టారు. అవినీతి చేస్తే ప్రజా ప్రతినిధులకు అవినీతి యాప్ ఎందుకు ప్రవేశ పెట్టరు? ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు చేతకాని హామీలు సిపిఎస్ రద్దు, న్యాయమైన పిఆర్సి అమలు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేస్తాం, ఔట్సోర్స్ ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ చేస్తాం, నిరుద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం, ఇలాంటి అనేకమైన హామీలు ఇచ్చి నేడు నెరవేర్చడానికి చేతకాక ప్రభుత్వ ఉద్యోగులను యాప్ లా పేరుతో బెదిరించడం ఎంతవరకు సమంజసం. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చమంటే బలవంతంగా ఒత్తిడికి గురి చేస్తూ, దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉద్యోగులని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తా ఉంది. స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రుల మనోగతానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా కొత్త విద్యా విధానం పేరుతో ప్రభుత్వ బడులను విలీనం చేస్తూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఏదో విధంగా ప్రభుత్వ ఉద్యోగులని మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పైన ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులను తమ చొప్పు చేతులో పెట్టుకొని ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కోసం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున ఉద్యమం చేసి ప్రభుత్వ మెడలు ఉంచుతామని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *