న్యాయం జరిగే వరకు అండగా ఉంటా: మేరుగు శివ కోటి యాదవ్

  • భూమి కొనుగోలు చేసి మోసపోయిన నర్సంపేట పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు
  • మాకు అండగా నిలిచి న్యాయం చేయాలని “జనసేన పార్టీని ఆశ్రయించిన బాధితులు”
  • న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన అండగా ఉంటానని హామీ ఇచ్చిన జనసేన నర్సంపేట నియోజకవర్గ నాయకులు మరియు కో- ఆర్డినేటర్ మేరుగు శివ కోటి యాదవ్

వరంగల్, నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గుండా సమ్మయ్య, పుష్పవతిలు భూమి కొనుగోలు విషయంలో తాము మోసపోయాము అని న్యాయం కోసం జనపార్టీ నాయకులు మేరుగు శివ కోటి యాదవ్ ని ఆశ్రయించడం జరిగింది. వారు తెలిపిన విషయం ఏమిటి అంటే తేదీ 31-03-2018 రోజున నర్సంపేట పట్టణానికి చెందిన తమ బంధువులు అయినటువంటి శివ నాదుల భగవాన్ మరియు శివ నాదుల సుధీర్ అనే ఇద్దరు అన్నదమ్ముల వద్ద నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఉన్నటువంటి 150 గజాల స్థలాన్ని 10 లక్షల 20 వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు గాను వారు అనుకున్న వాయిదా పద్ధతి ప్రకారం ముందుగా 7 లక్షల 20 వేల రూపాయలు భగవాన్, సుధీర్ లకి చెల్లించారు. మిగతా 3 లక్షల రూపాయలు పెద్దమనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం 20-08-2018 రోజున చెల్లించినచో భగవాన్, సుధీర్ లు ఇద్దరు సమ్మయ్యకి వారు అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ చేయించాలి. కాని ఇక్కడ భగవాన్, సుధీర్ ఇద్దరు అన్నదమ్ములు వద్ద ఆ భూమికి సంబంధించిన ఆధారాలు లేక పోగా, సమ్మయ్యకి చూపించగా పోగా సమ్మయ్యకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిపోయి మరుసటి రోజు 21-08-2018 రోజున భగవాన్, సుధీర్ లు ఇద్దరు ఒప్పందం ప్రకారం అందుకు విరుద్ధంగా ఆధారాలు సృష్టించి వారి ఇద్దరి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సమ్మయ్య వారికి ఇచ్చిన 7 లక్షల 20 వేల డబ్బులు తిరిగి ఇవ్వడం గానీ లేదా రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని మమ్మల్ని వారు మోసం చేశారు అని, ఎన్నో సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన ఫలితం లేకుండా పోయిందని తమకు అండగా నిలిచి న్యాయం చేయాలని జన సేన పార్టీ నాయకులు శివ కోటి యాదవ్ ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయంపై శివ కోటి యాదవ్ బాధితుల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి సమ్మయ్య, పుష్పవతి, దంపతులు ఇద్దరికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది.