టిడ్కో ఇళ్లకు మోక్షం వచ్చేనా

  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పేదలకు టిడ్కో ఇళ్ళు ఇవ్వండి

అనంతపురం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కక్ష పూరిత ఆలోచనలు, విధానాలు మానుకుని టిడ్కో ఇళ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని జనసేనపార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవ రోజు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణం సమీపంలోని టిడ్కో గృహాలను పామిడి మండల అధ్యక్షులు ధనుంజయ, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠలతో కలిసి సందర్శించి అక్కడ నిర్మాణాలు జరిపిన విధానాన్ని, మౌలిక సౌకర్యాలను, వాటి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్బంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిర్మించిన ఇళ్ళు దాదాపు 80 శాతం నిర్మాణాలు పూర్తీ అయ్యి అరకొర పనులు పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తీ చేసి లబ్ధిదారులకు అందజేయకుండా రాజకీయ కక్షతో వాటిని గాలికి వదిలేసి అటు ప్రజా ధనం దుర్వినియోగం అయ్యేలా, ఇటు నిరుపేద లబ్ధిదారుల సొంతింటి కలలు నీరు కార్చేలా జగన్ రెడ్డి తన సైకో ఇజాన్ని రాష్ట్ర ప్రజలపై ప్రయోగిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను పేదలకు పంచి పెట్టాలని, కేంద్రం నుండి వచ్చే నిధులు సక్రమంగా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వానికి హితువు పలికారు. లేని పక్షంలో జనసేనపార్టీ తరుపున గృహ లబ్ధిదారుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయల సీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాసేట్టి సంజీవ రాయుడు, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, వీర మహిళలు వాణి, కుల్లాయమ్మ, ధార్బి, శైలజ, శారద, వరలక్ష్మి, అనసూయ, నాయకులు రాజశేఖర్, పూజారి పవన్, వన్నూరు, ఉత్తేజ్ జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.