చిరంజీవి యువత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

🔸మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం
🔸జనసేన వీరమహిళలకు సత్కారం
🔸ముఖ్యఅతిథిగా హాజరైన పాలవలస యశస్వి

విజయనగరం, మార్చ్ 8న, అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం, అయ్యన్నపేట జంక్షన్ వద్ద, విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మహిళా దినోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద కేవలం మహిళలుకు మెగావైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులు డాక్టర్ సింధూరి వడ్డాధి వచ్చిన మహిళలకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరంజీవి యువత సేవలు వెలకట్టలేనివని, సమాజానికి చేసేసేవల్లో మెగాఫ్యామిలీ అభిమానులు సమాజంలో ముందుంటారని, మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా వైద్య శిబిరాన్ని నిర్వహించి, ఇలా మహిళలును సత్కరించటం అభినందనీయమని అంటూ విజయనగరం జిల్లా చిరంజీవి యువత చేసేసేవలను ఆమె కొనియాడారు. విజయనగరం జిల్లా చిరంజీవి అధ్యక్షుడు, జనసేన సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా చిరంజీవి యువత పనిచేస్తుందని,అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామినాయుడు,రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు పి.భవానీ రవికుమార్ సారధ్యంలో మరెన్నో సేవాకార్యక్రమలే లక్ష్యంగా ముందుకెళ్తామని అన్నారు. అనంతరం శ్రీమతి పాలవలస యశస్వి తోపాటు జనసేన వీరమహిళలు తుమ్మి లక్ష్మీ రాజ్, గంట్లాన పుష్పకుమారి, మాతాగాయత్రి, పద్మశ్రీ దాస్, భారతి మరియు డాక్టర్ సింధూరి లకు విశిష్ట అతిథిలుగా హాజరైన శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ పెద్దలు ఎడ్ల గణేష్, కర్రోతు ఈశ్వరప్రసాద్ ల చేతులమీదుగా సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు అంబులెన్స్ శివ, అనిల్, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పతివాడ నారాయణ రావు, జిల్లా చిరంజీవి యువత, జనసేన యువనాయకులు సారికి మురళి మోహన్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, సారికి విశ్వనాధ్, హుస్సేన్ ఖాన్, లాలిశెట్టి రవితేజ, కిలారి ప్రసాద్, మిడతాన రవికుమార్, వై. నలమరాజు, కొమ్మూజి సాయి, ఉదయ్, రవికుమార్, పైడిరాజు, సూరిబాబు, ఆలబోయిన శివ, తదితరులు పాల్గొన్నారు.