ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

  • అవసరమైతే వ్యక్తిగత సహాయం చేయడానికైనా సిద్ధం
  • దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు
  • విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆయన 39వ వార్డు ఫెర్రీ వీధిలో పుష్పవతి అయిన కవలలో మొదట అమ్మాయి లక్ష్మికి పట్టు బట్టలు వెండి పట్టీలు అందజేశారు. అలాగే ఆ ప్రాంతంలో పర్యటించి పలువురు దివ్యాంగులను కలుసుకున్నారు. వారికి వీల్ చైర్ లను త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు. మరి కొద్ది రోజులలో మళ్ళీ ఆ ప్రాంతంలో పర్యటించి దివ్యాంగులకు తప్పకుండా వీల్ చేయగలను అందజేయునునట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే వ్యక్తిగత సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అన్ని విధాలుగా జనసేన నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటున్నారని చెప్పారు. రెండు మూడు రోజులలో ఫెర్రీ వీధులను దివ్యాంగులకు వీల్ చైర్లను అందించనున్నట్లు మరోసారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.