గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: పాటంశెట్టి సూర్యచంద్ర

  • తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు – పవన్ కళ్యాణ్

జగ్గంపేట నియోజకవర్గం: చిన్నచిన్న అర్థం లేని కారణాలతో పంతాలు పట్టింపులు ఈగోలకు వెళ్లడం వలన కష్టానికి తగ్గ ఫలితం ఉండదని స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుకూలంగా అందరితో కలిసి మెలిసి ఐకమత్యంగా చేయి చేయి కలుపుకుంటూ వెళ్లే వారందరూ జనసేన పార్టీలో నాయకులు అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర జనసైనికులు అందరికీ అవగాహన కల్పించారు. వ్యవస్థ మార్పు కోసం స్థాపించిన జనసేన పార్టీ దిన దినాభివృద్ధి చెందాలన్నా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా జనసైనికులు అందరూ ఐకమత్యంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.