అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మరియు గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం

*సుమారు మూడువందల మందికి రక్తపోటు పరీక్షలు

*ముఖ్యఅతిధిగా వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ నాలుగెస్సల రాజు

*రక్తపోటుపై అవగాహన కల్పించిన డాక్టర్ మహేష్

విజయనగరం: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్బంగా స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మరియు గ్రామీణ వైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా.. వెంకటరామ హాస్పిటల్ వారి వైష్ణవ్ హార్ట్ కేర్ సెంటర్ సౌజన్యంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేష్ నేతృత్వంలో సుమారు మూడువందల మంది రోగులకు రక్తపోటు, షుగర్ వ్యాధి, మరియు అవసరమైన రోగులకు ఈ.సి.జి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ మహేష్ రక్తపోటు వ్యాధిపై రోగులకు అవగాహన కల్పించారు.

ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా వాకర్స్ క్లబ్, గ్రంధాలయం ఉద్యమకారులు, ప్రముఖ న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్, వాకర్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఎస్.ఎస్.ఎస్.ఎస్.వి.ఆర్. ఎం.రాజు హాజరయ్యారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రక్తపోటు దినోత్సవం సందర్బంగా ఇటువంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమని, చాలా మంది ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవడం వలన తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తారని, ముప్పై ఏళ్ళు దాటిన ప్రతీఒక్కరూ రక్తపోటు పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని, రక్తపోటును నియంత్రించు కోవాలన్నారు. తమ ఆరోగ్యం కాపాడుకుంటూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సేవలు సమాజానికి ఆదర్శంగా వాకర్స్ క్లబ్స్ నిలుస్తాయని అన్నారు.

అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు గెద్ద చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 ఎలక్ట్ గవర్నర్ కె. సత్యం, బాలాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు వి. రమ, అంజనీపుత్ర వాకర్స్ క్లబ్ కార్యదర్శి రవిరాజ్ చౌదరి, ఉపాధ్యక్షులు పిడుగు సతీష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ ఎస్. మురళీమోహన్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, గ్రామీణ వైద్యుల సంఘం సహాయ కార్యదర్శి కనకాచారి, ఉపాధ్యక్షలు ఉమాశంకర్, జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ మాతా గాయత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామ చంద్రరాజు, రౌతు సతీష్, వంక నరసింగరావు, ఎర్నగుల చక్రవర్తి, మిడతాన రవికుమార్, పెద్దమొత్తంలో వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.