తటవర్తి కోటేశ్వరరావు (కోటప్ప) కుటుంబానికి యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శ

  • జనసేన తరఫున రూ. 5 వేలు ఆర్ధిక సాయం
  • ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి గాయాల పాలైన కోటేశ్వరరావు.

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కోకనారాయణ పాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు తటవర్తి కోటేశ్వర రావు భవన నిర్మాణ పనులు చేస్తూ ఉంటారు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి కిందకు పడిపోయారు, రెండు కాళ్ళు విరిగిపోయాయి, తలకు, కంటికి బలమైన గాయలయ్యాయి. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆదివారం కోకనారాయణ గ్రామంలోని కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 5 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. కోటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోటేశ్వర రావు కోలుకునే వరకు ప్రతీ నెల ఆ కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేస్తామని చెప్పారు, వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల అధ్యక్షులు దాసరి ఉమా సాయి రామ్, జనసేన నాయకులు పోలగని లక్ష్మీ నారాయణ, పెడన మండలం నాయకులు పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందర రాజు, శాయన సురేష్, దమిసెట్టి రాము, పులి శంతన్, బావిసెట్టి శ్రీకాంత్, తటవర్తి నరేష్, రేపల్లె పృథ్వి, చోడగం వినాయక్ కొలపల్లి శ్రీకాంత్, గడ్డిగోపుల నాగ, సింగంసెట్టి అశోక్ కుమార్, కొఠారి మల్లి బాబు, నందం శివ స్వామి, బాదం వినోద్, దారపు రెడ్డి నవీన్ అంజి బాబు, పవన్ పాల్గొన్నారు.