యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమం శనివారం పెడన పట్టణ శివారు పల్లోటి స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో మరియు పెడన పట్టణం పైడమ్మ కాలనీ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ మరియు #JaganannaMosam ప్లకార్డ్స్ తో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను గురించి పరిశీలించి వాటిని గుర్తించడం జరిగింది. త్వరలోనే ఈ జగనన్న ఇళ్లు అవినీతికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పూర్తిస్థాయిలో బయటపెట్టబోతున్నము అని జనసేన నాయకులు రామ్ సుధీర్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి వరుదు రమా దేవి, పెడన మండలం అధ్యక్షులు ఉసా వెంకయ్య, ఉపాధ్యక్షులు చీర్ల నవీన్ కృష్ణ, పోలగాని లక్ష్మీ నారాయణ, పూల్లేటి దుర్గారావు, సయ్యిద్ షఫీ, రంగయ్య, మల్లి బాబు, బాకీ నాని, సుంకర అంజిబాబు, అశోక్, వినోద్, శివ పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులు మహిళలను రెచ్చగొట్టి అడ్డుకోవాలని చూసారు, భవన నిర్మాణ కార్మికుల ముసుగులో ఉన్న తమ కార్యకర్తలను పంపి జనసేన నాయకుల పై దాడికి తెగబడ్డారు, ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.