వైసిపి దగా కోరు పథకం కాపు నేస్తం: ఎస్.వి.బాబు

పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు ఎస్.వి.బాబు మాట్లాడుతూ కాపు కులస్తులను వైసిపి ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం జగన్ గారికి పరిపాటి.

జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పింది. కానీ ఐదు సంవత్సరాలలో టిడిపి ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 1340 కోట్లే, ఐదు సంవత్సరాల కలిపి 5000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెట్టలేదని, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించి ముసల కన్నీళ్లు కార్చిన నేటి ముఖ్యమంత్రి.
తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2000 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది.

వైసిపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయింది. అంటే కాపు కార్పొరేషన్ కి 6000 కోట్లు కేటాయించాలి.

వాస్తవానికి కాపు కార్పొరేషన్ కి ఒక పైసా నిధులు కూడా కేటాయించలేదు. పైసా కూడా ఖర్చు పెట్టని కాపు కార్పొరేషన్ కి ఒక చైర్మన్, జీతం, కారు, వగైరా, వగైరా అలవెన్సులు.

నిజానికి కాపులకు మీరు ఇచ్చిన హామీలు ఎంత?
వాస్తవానికి మీరు ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత?

ధైర్యం ఉంటే నిజంగా మీలో నిజాయితీ ఉంటే, ఈ విషయంపై శ్వేత పత్రం విడుదల చేయగలరా?

కాపుల ఓట్లతో ఎమ్మెల్యేలే, ఆపై మంత్రులై అధికారాన్ని అనుభవిస్తున్న వైసీపీ కాపు నాయకులారా మీరైనా సమాధానం చెప్పగలరా?

వైసిపి గవర్నమెంట్ లో ఉన్న కాపు ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ లు పెట్టడానికి తప్ప ఎందుకు పనికిరారు అని, కాపుల ఆకాంక్షలను నెరవేర్చలేరని ప్రతి కాపు సోదర సోదరీమణులకు తెలుసు.

కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూడా వైసిపి ప్రభుత్వం దగా చేస్తుంది.

ప్రజలను వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి పబ్బం గడుపుకుంటున్న వైసిపి పార్టీకి రాబోయే ఎన్నికల్లో అన్ని వర్గాలు గట్టిగా బుద్ధి చెప్పటం తథ్యం అని ఎస్.వి.బాబు హెచ్చరించారు.