ఓటు బ్యాంకు రాజకీయంతో ఈదువారి పల్లి గ్రామాన్ని మరచిన వైసీపీ: డా. యుగంధర్ పొన్న

*నిరుపేదలను మరిచారు

*తారురోడ్లు లేవు, తాగునీరు సౌకర్యం లేదు

*చివరికి స్మశానంలోనూ.. ఇబ్బందులు

*పరిష్కారం చూపకపొతే రోడ్డుపైన మహాధర్నా చేస్తాము

*జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

కార్వేటినగరం మండలం, గోపీశెట్టి పల్లి పంచాయతీ, ఈదు వారి పల్లి గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పాల్గొని అక్కడ నెలకొని ఉన్న సమస్యను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈదువారి పల్లి గ్రామాన్ని మరిచారని వైసిపి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు సౌకర్యం సరిగా లేదు, స్మశాన వాటికలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గత 30 సంవత్సరాలుగా సరైన రోడ్డు లేకుండా గ్రామ ప్రజలు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గోపిశెట్టి పల్లి రోడ్డు నుండి వయా ఈదు వారి పల్లి ఏ. ఏ. డబ్ల్యు మీదుగా గొల్ల కండ్రిగ రోడ్డు వరకు తారు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రజలకు అసౌకర్యంగా ఉందని, గతంలో అనేక మంది ఈ రోడ్డు మీద ప్రజలు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. దీనికి సరైన పరిష్కారం చూపకపోతే జనసైనికులతో కలిసి మహా ధర్నా చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేను నిలదీయాల్సిన అవసరం ఉందని, ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందని, అవసరమైతే నిరసన తెలపాల్సిన ప్రాముఖ్యత ఉందని తెలిపారు. మూడు సంవత్సరాలు మౌలిక వసతుల కల్పనలో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం, రామ రాజ్యం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరిన రాజ్యాధికారం జనసేన తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నరసింహులు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్యదర్శి అజిత్, జనసైనికులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.