పాలనలో వై.సి.పి పూర్తిగా విఫలం: ముత్తా శశిథర్

  • మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా, ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో 16ఏ వ వార్డు సచివాలయం పరిధిలో జి.చిన్న ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు మాట్లడుతూ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరమూ నిరుపేదలమనీ, కానీ తమకు ప్రభుత్వ పధకాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇళ్ళ పట్టాలు చాలా మందికి ఇవ్వలేదనీ, పొందిన కొందరు అవి యెక్కడ ఉన్నాయో తెలియడం లేదని వాపోయారు. దీనిపై స్పందిస్తూ ముత్తా శశిధర్ కాకినాడలో పదహారు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామని గొప్పలు ఈ వై.సి.పి ప్రభుత్వం చెప్పుకుంటోందనీ, కానీ తాను ఎక్కడకి వెళ్ళినా పేదలు తమకు అందలేదనీ, అందిన కొద్ది మందీ కాగితాలు మాత్రమే తమకు అందాయనీ వాటి వైనం తెలీదని చెపుతున్నారనీ, దీనినిబట్టి చూస్తుంటే ఇదంతా మసిపూసి మాయచేసి అనే చందాన వుందనిపిస్తోందన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం పూర్తిగా పాలన చేయడంలో విఫలమైందన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ అక్రమ సారా, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, అసలు పాలన పూర్తిగా ఈ వై.సి.పి ప్రభుత్వంలో గాడితప్పిందని విమర్శించారు. ఎంతో పేరు కలిగి కొన్ని దశాబ్దాల క్రితం నెలకొల్పిన గాంధీ సెంటినరీ స్కూలుని మూసివేసి కళ్యాణ మండపంగా మార్చడం చాలా దారుణమని, తానుకూడా ఆ స్కూలు విధ్యార్ధినే అని బాధను వ్యక్తీకరించారు. ప్రజలకోసం జనసేన పార్టీ ఉందనీ, వారి సంక్షేమం కోసం తామందరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిటి ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, వీరమహిళలు కొండా రమణమ్మ, రాణి, రత్నవేణి, వరలక్ష్మి, జనసైనికులు శివాజి, వాసు, బాలాజీ, వేణు తదితరులు పాల్గొన్నారు.