కడిగిన ముత్యంలా జనసైన్యంలోకి కిరణ్ రాయల్

  • కిరాతకంగా అరెస్టు చేసినా కిరణ్ రాయల్ కు కోర్టు బెయిల్
  • ప్రజాస్వామ్యంలో సత్యమే గెలిచింది
  • నిజం, నిజాయితీలకు ఎప్పుడూ విజయమే
  • నియంత పాలనతో… పోలీస్ యంత్రాంగం విఫలం
  • ఐపీసీ సెక్షన్ల ను మర్చిపోయి వైసిపి సెక్షన్లతో పోలీసు వ్యవస్థ పని చేస్తుంది.
  • మంత్రి రోజాపై అధికార/చట్ట దుర్వినియోగఒ కేసు వేస్తాం
  • విజయం సాధించిన జనసేన పార్టీ వర్ధిల్లాలంటూ జనసైనికుల స్లోగన్స్

తిరుపతి, గత కొంతకాలంగా పర్యాటక శాఖ మంత్రి రోజా జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ల మధ్య రాజకీయ పోటాపోటీ మాటల యుద్ధం జరుగుతోంది. ఇది కాస్త పెద్దదై శుక్రవారం సాయంత్రం కిరణ్ రాయల్ నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు హల్చల్ చేస్తూ చివరికి నగిరి పోలీసులు, మంత్రి రోజా ప్రమేయం తో నగిరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని బాధితుడు కిరణ్ రాయల్ శనివారం ఓ ప్రైవేటు హోటల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తనను నెంబర్ లేని వాహనంలో తనపై దాడి చేస్తూ ఓ టెర్రరిస్టును తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ముఖాముఖి చర్చలకు రావాలే గాని.. ఇలా తన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలా తోసుకుంటూ తీసుకెళ్లడం సమంజసమా అని ప్రశ్నించారు. స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు ఏ కేసు పెట్టాలో కూడా తెలియకుండా దాదాపు పది పేపర్లు రాసి చించారన్నారు. చివరికి నాన్ బెయీల్బుల్ కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. జడ్జి పోలీసులకు ముట్టికాయ వేస్తూ తనకు బెయిల్ మంజూరు చేయడం పట్ల సత్యం గెలిచిందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన అరెస్టు వెనుక త్రిబుల్ ఆర్ మూడు రెడ్ల కుట్రలు ఉందని ఆరోపించారు. తనను పోలీస్ స్టేషన్లో ఎలా హింసించారో “ప్రతీకారంగా” రానున్న తమ జనసేన పార్టీ పాలనలో తనను “హింసించిన” వీరిని ఇప్పుడున్న పోలీస్ అధికారుల చేతులతోనే వాయించి ప్రతీకారం తీర్చుకుంటానని శపదం చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. తమ జనసేనాని నీతి, నిజాయితీ నడవడికతో వైకాపాలో భయం పుట్టుకున్నదని కిరణ్ రాయల్ అరెస్ట్ పట్ల రాష్ట్ర జనం మొత్తం వైసీపీ కుట్రలను మరోసారి తెలుసుకున్నదన్నారు. దీంతో భయం పుట్టుకున్న ఫ్యాన్ పార్టీ పోలీస్ స్టేషన్లో (కిరణ్ రాయల్ ను) నాలుగు రోజులు పెట్టాలనుకున్న వ్యవహారాన్ని కోర్టు బెయిల్ తో శుభం కార్డు వేశారని, చివరికి గెలుపు జనసేనదేనన్నారు. మంత్రి రోజాపై అధికార/చట్ట దుర్వినియోగ కేసును వేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, మహిళా నేతలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, కాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోట, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, వనజమ్మ, బాబ్జి, మధుబాబు, హెమకుమర్, ముక్కు సత్యవంతుడు, సుమన్ బాబు, పండిటి మళోత్ర, చంద్రబాబు, లక్ష్మీ, తోట జయంతి, మునస్వామి, దేవర మనోహర్, ఆనంద్, సుమన్, పార్థు, విజయ రెడ్డి, రమేష్, ఆదికేశవులు, ఈశ్వర్ రాయల్, మనోజ్, రాజేష్, హేమంత్, సాయి పురుషోత్తం, బాలాజీ, గుణ, పవన్ కుమార్, తదితరులతోపాటు జనసైనికులు స్వీట్లు పంచుకుంటూ వారి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.