మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు.. ఎస్.వి.బాబు

పెడన: మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమీపిస్తున్న వేళ హడావిడి చేయాలని తూతూ మంత్రంగా మచిలీపట్నం పోర్ట్ పై వైసీపీ హడావిడి చేస్తుందని ఏద్దేవా చేసారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వైసిపి ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు డ్రామా ఆడుతుంది. గతంలో మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం అంటూ రెండు మూడు పర్యాయాలు శంకుస్థాపనలు చేయడం జరిగింది. పారా మట్టి తీసింది లేదు నాలుగు ఇటికలు పెట్టింది లేదు. తీర ప్రాంత ప్రజల ఆశలతో, కలలతో ఆటలాడుకుంటున్న రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు. పోర్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు వచ్చాయా?.. ప్రాజెక్టుకు సంబంధించిన డి పి ఆర్ వివరాలు వెల్లడించగలరా?.. నిర్మాణ బాధ్యతలు చేపట్టే కంపెనీ వివరాలు తెలియజేయగలరా?.. నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ జరిగిందా?.. పవన్ కళ్యాణ్ గారిపై ప్రెస్ మీట్ లు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేసే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నానికి పోర్ట్ నిర్మాణంపై చిత్తశుద్ధి లేదనేది మచిలీపట్నం ప్రజల ఆరోపణ. పేర్ని మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నం బస్టాండ్ కూడా నిర్మించలేదు ఇప్పుడు మాజీ మంత్రి పోర్ట్ నిర్మాణం అంటే నమ్మాలా అని మచిలీపట్నం ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరగాలి తద్వారా తీర ప్రాంతం అభివృద్ధి జరగాలని, యువతీ యువకులకు ఉద్యోగ కల్పన జరగాలని జనసేన పార్టీ బలంగా ఆకాంక్షిస్తుంది. మా మచిలీపట్నం ప్రజల ఆకాంక్ష తీరాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టాలి. రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ వల్లే నెరవేరుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎస్ వి బాబు తెలిపారు.