విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వైసీపీదే

• ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి.. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి.
• అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్ళి చర్చించాలి.
• స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉంటుంది.
• అప్పుల్లో ఉందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించినట్టే అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ ప్రైవేటుపరంచేస్తారా?
• అమరావతి మాదిరి స్టీల్ ప్లాంట్ కి కూడా అండగా నిలబడతాం
• వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం… దూరంగా పెట్టండి
• వైసీపీకి వేసే ఓటు పెనం మీద పడిన వర్షపు చినుకు లాంటిదే.. ఆవిరైపోవడమే
• నా సినిమాలు ఆపి ఆర్థిక మూలాల్ని దెబ్బకొడితే భయపడతాననుకున్నారా?
• వైసీపీని ఏడుకొండలవాడు కూడా భరించలేకపోతున్నాడు.
• సొంత జిల్లాకు కష్టం వస్తే పట్టించుకోని సీఎం.. స్టీల్ ప్లాంట్ ని ఏం పట్టించుకుంటారు?
• ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు శిలాఫలకం కూడా వేయలేకపోయారు
• 500 మంది సలహాదారులు ఉండి ఏమి ప్రయోజనం?
• 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి వైసీపీ చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పిస్తాం
• విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత వైసీపీదేనని, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వైసీపీ ఎంపిలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఫ్లకార్డులతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు వ్యక్తపరచాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కచ్చితంగా పార్లమెంట్లో విశాఖ ఉక్కుపై మాట్లాడాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అఖిల పకాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళి చర్చించాలి. అని తెలిపారు. విశాఖ ప్లాంట్ పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందనీ, అఖిలపక్షంతో కూర్చుని ప్రైవేటీకరణను ఆపేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలిపారు. అయితే అంత కంటే ముందు వైసీపీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నిలబడుతుందా లేదా అన్నది తేల్చుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడు జనసేన పార్టీ కావాలి ఓటు వేసేందుకు మాత్రం. వైసీపీ కావాలి అని ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయని చెప్పారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం అని దాన్ని అంతా దూరంగా పెట్టాలని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఒక నినాదంగా ముందుకు తీసుకువెళ్లాని పిలుపునిచ్చారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షను చేపట్టారు. యం 10. నుంచి సాయంత్రం గంటల వరకు పార్టీ నాయకులతో క్షకు కూర్చున్నారు.

దీక్ష విరమణ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ.. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణను ఎలా అడ్డుకున్నామో అదే మాదిరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, అయితే అంతకు ముందు వైసీపీ ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు బలంగా నిలదీయాలి. బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలను, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పెద్ద నాయకులను సంఘీభావం తెలపమని అడగండి. ఎమ్మెల్యేలు, ఎంపీలను కేంద్రాన్ని అడగమని చెప్పండి. వైసీపీ నిలబడకపోతే వారిని బాధ్యుల్ని చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించుకునే బాధ్యతను జనసేన పార్టీ భుజాన వేసుకుంటుంది.

• మావల్ల కాదు అని వైసీపీ చెబితే…

వైసీపీకి ఉన్నట్టు జనసేన పార్టీకి 22 మంది ఎంపీలు ఉంటే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వైసీపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎంత సమయం కావాలో తీసుకోండి. స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు, కార్మిక సంఘాలు, భూములు కోల్పోయిన రైతు సంఘాలు బలంగా నిలబడితే సమస్యను ఢిల్లీ వరకు తీసుకువెళ్లేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. జాతీయ స్థాయి నాయకత్వం నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడినా.. నా మాట శాసనం కాదు. 22 మంది ఎంపీల మాట శాసనం. నేను ప్రజా క్షేత్రంలో మాత్రమే బలవంతుడిని. ఆ బలం నాకుంటే వైసీపీ వాళ్లలా చేతకాని వ్యక్తుల్లా కూర్చునే వాడిని కాదు. వైసీపీ మా వల్ల కాదు అంటే ప్రైవేటీకరణను ఆపేందుకు మా ప్రయత్నం మేము చేస్తాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద ఆలోచించి ముందుకు వెళ్లాం. అయితే మద్దతు ఇవ్వని వైసీపీని ఎలా ఎండగట్టాలి? కేంద్రం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అన్న ఆలోచన చేద్దాం. జనసిన పార్టీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. అయితే కార్మికులు, కార్మిక సంఘాలు, నిర్వాసిత రైతులు, వారి కుటుంబాలు నిలబడకపోతే మీకు లేని కోపాన్ని మేము తెప్పించలేం..

• ఇక్కడి మంచి మాట్లాడితే తాడేపల్లికి వినిపిస్తుంది

కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మాకు బాధ్యత లేదు అంటే ఎన్నికల సమయంలో మాటిందుకు ఇచ్చారు. అదే విషయాన్ని ప్రజలు నిలదీయాలి. విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టుకుని మంగళగిరిలో నిరసన తెలపడానికి కారణం ఉంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శ్రీ అమృతరావు గారు ప్రాతినిధ్యం వహించింది. తాడికొండ నియోజకవర్గం నుంచే, విశాఖ నుంచి మాట్లాడితే వినిపించని ముఖ్యమంత్రి గారికి మంగళగిరి నుంచి మాట్లాడితే. అయినా వినబడుతుందేమోనన్నది కూడా దీళ్ల ఇక్కడ పెట్టడానికి ఒక కారణం. రూ. 22 వేల కోట్ల అప్పు ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలని చూస్తే.. మరి రూ. 6 లక్షల కోట్ల అప్పు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరిస్తారా? విశాఖ ఉక్కు కార్మికులకు, భూములు కోల్పోయిన రైతులకు మరోసారి మాటిస్తున్నాం. అమరావతికి ఎలా అయితే నిలబడ్డామో.. మీకు అలాగే అండగా నిలబడతాం. ఆనాడు అమరావతి కదలదు అన్న మాటను శ్రీ అమిత్ షా గారి మాటతో నిజం చేశారు. స్టీల్ ప్లాంట్ మీద ప్రతిపాదన వచ్చిన వెంటనే కూడా ఢిల్లీ వెళ్లి. నివేదించాం. స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక గా చూడమన్నాం.

• సగటు మనిషి నుంచి జడ్జీల వరకూ అందర్నీ బెదిరిస్తారు

ఎన్నికల ముందు పాదయాత్రలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం కూడా బయటకు రండి. పాదయాత్రలు చేయండి. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ పాలనలో ఏ వర్గమూ సుఖంగా లేదు. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ లేక యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. గద్దెనెక్కిన తర్వాత మాట్లాడడం లేదు. మనం మాట్లాడుదాం అంటే భయపెట్టే ప్రయత్నం చేస్తారు. గూండాగిరి చేస్తారు. సగటు మనిషి దగ్గర నుంచి సుప్రీం కోర్టు జడ్జీల వరకు ప్రతి ఒక్కరినీ బెదిరించడమే. దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వారు దాడులు చేస్తే నిస్సహాయ స్థితికి వెళ్లిపోవడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించగలిగితే ఎమ్మెల్యే, ఎంపీ ఏ స్థాయిలో పని చేస్తారో చేసి చూపుతాం. జీవీఎంసీ ఎన్నికల కోసం విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని గొంతులు చించుకుని మాట్లాడారు. అయ్యాక ముఖం చాటేశారు. అలాంటి నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయకపోతే వారు మాట వినరు. ఇది ఒక సమస్య, వర్గం సమస్యో కాదు. రాష్ట్ర ప్రజలందరి సమస్య అంతా కలిసి రావాలి. ప్రజలు వైసీపీని పాలించమని ఓటు వేశారు. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు మరో రెండున్నరేళ్లు వారిని భరించకతప్పదు. వాళ్లు రౌడీయిజం, గూండాయిజం చేసినా భరించాలి, బూతులు తిట్టినా భరించాలి. వాళ్లందరికీ 2024 తర్వాత మనం సమాధానం చెబుదాం. ఈ పరిస్థితులన్నింటికీ ఆలోచించి ఓటు వేయకపోవడమే కారణం. ఓటు విలువ తెలియకుండా రూ.2 వేలకు అమ్ముకోవడమే ఈ రోజు పడుతున్న ప్రతి కష్టానికి కారణం.

• వాన చినుకు ముత్యపు చిప్ప

అన్ని కులాలకు సాధికారత రావాలి. కులాల వారీగా పదవులు ఇచ్చి నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వకుంటే అది నిష్ప్రయోజనం. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు, వర్గాలకు సంపూర్ణ సాధికారత ఇస్తుంది. అన్ని సమస్యలపై అండగా నిలబడుతుంది. మేము డబ్బు పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి రాలేదు. వైసీపీ నాయకుల్లాకేసులు ఉంటే అసలు రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదు. అలా చేస్తే ప్రజలకు ద్రోహం చేసిన వారి మవుతాము. దీక్షలో దామోదరం సంజీవయ్య గారి పుస్తకం చదివితే అందులో కొన్ని పదాలు నన్ను ఆకర్షించాయి. చినుకు వేడి పెనం మీద పడితే ఆవిరైపోతుంది. తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. అదే ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది.. నీ ఓటు చినుకు అయితే 2019లో ప్రజలు వైసీపీ అనే పెనం మీద చేశారు జీవితాలు కాలిపోయాయి. ఆవిరైపోయాయి. అలా చూడిపోయిన కుటుంబాల్లో కార్మికుల కుటుంబాలు కూడా ఉన్నాయి. జనసేన పార్టీకి ఓటు వేస్తే ముత్యంలా నిలబడుతుంది. మేము ఏ రోజు ప్రజాక్షేత్రం నుంచి పారిపోము. దశాబ్దాలుగా పెనవేసుకున్న వారసత్వ రాజకీయాల కారణంగా కొంత మందికే బ్ధి చేకూరుతోంది. అలా కాకుండా అణగారిన వర్గాలకు సాధికారతతో కూడిన అధికారం ఇవ్వాలి అంటే జనసేనకు ఓటు వేయాలి. శ్రీ దామోదరం సంజీవయ్య గారి లాంటి మనుషుల్ని జనసేన ప్రేరణగా తీసుకుంటుంది. కాంగ్రెస్ నాయకుడు అయినా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి కాబట్టి ఆ మహనీయుడిని ప్రేరణగా తీసుకున్నాం. రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. రెండేళ్ల కంటే తక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రి వృద్ధాప్య పించన్, కార్మికులకు అండగా ఉండే పథకాలు, నీటిపారుదల పథకాలు ఎన్నో తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తిని కూడా పట్టించుకోలేదు. రాయలసీమ నుంచి ఓ మహాత్ముడు వస్తే గుర్తింపు లేదు కర్నూలు రాజధాని అంటే ఎలా నమ్ముతాం? ఉత్తరాంధ్ర రాజధాని. అంటే ఎలా నమ్ముతాం. చిన్న స్మారకం కట్టించలేని మీరా రాజధాని కట్టిది. జనసేన పార్టీ ప్రజల అండదండలు పొందుతుంది. మీరు ముఖ్యమంత్రిగా ఉండి రూ. కోటి విడుదల చేయలేకపోయారు. మీ వద్ద డబ్బు లేక కాదు మనసు లేదు. అణగారిన వర్గాలు ఎదగకూడదన్న ఆలోచన స్మారక భవనం లేకుండా చేసింది. బీసీ కులాల తాలూకు సాధికారత పేరు చెబితే శ్రీ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అయితే ఆయన తర్వాత ఆ సాధికారత అలంకారప్రాయం అయ్యింది. బీసీలు, ఎంబీసీలు, మహిళలకు సాధికారత చూపాలన్నదే జనసేన ఆలోచనా విధానం.

• వైసీపీ ప్రతాపం అంతా జన సైనికుల మీదే

భారత దేశంలో ఉన్న వారసత్వ రాజకీయాలను ఒకే ఎన్నికతో ఎక్కన పెట్టిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీజీ, వారసత్వం ఉన్న-వ్యక్తులు మాత్రమే కాక మిగిలిన వారు రాజకీయాల్లోకి రావాలి. ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలు వారసత్వం నుంచి వచ్చిన వారే. అయినా మీకు మాట్లాడే ధైర్యం లేదు. మా జనసైనికుల మీద మినహా పార్లమెంటులో మీ ప్రతాపం చూపలేరు. 22 మంది ఎంపీలు పార్లమెంటుకు కాపీలు తాగి, వడలు తినడానికి వెళ్తున్నారా?వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం. అది అర్ధం చేసుకుని 2024లో ప్రజలు జనసేన పక్షాన నిలబడాలి. లేకపోతే తర్వాత కష్టాలు వచ్చాయంటే ఏం చేస్తాం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా దౌర్జన్యం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. మేము సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల వారసులం. మీ పాలసీలను బుద్ధిబలంతో, దౌర్జన్యాలను కండబలంతో ఎదుర్కొంటాం. రైతుల విషయానికి వస్తే మిర్చి పంటకు రామర పురుగు చెబుతున్నారు. పంట పక్వానికి రాకముంది లక్షల ఎకరాల్లో పంట వర్షాల పాలయ్యింది. తెలుగుదేశం పార్టీ
హయాంలో నల్లి వచ్చింది. వీటి గురించి మాట్లాడే వ్యక్తులు లేరు. రైతులు నష్టపోతుంటే పట్టించుకునే నాథుడు లేడు. గోదావరి జిల్లాల్లో రైతులకు గిట్టుబాటు ధర కోసం దీక్ష చేసింది జనసేన పార్టీనే, సమస్య వచ్చినప్పుడు జనసేన కావాలి. ఓటు వేసేప్పుడు వైసీపీ అంటే పరిస్థితులు మారవు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి. వైసీపీ చేసిన ప్రతి పనికీ చేతే సమాధానం చెప్పిస్తాం. హామీలు, పాలసీల వ్యవహారంలో వైసీపీ మాటలకు అర్ధాలే వేరు అన్న చందంగా ఉంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేశారు. నాసినిమాలు ఆపేసి ఆ ఆర్థిక మూలాల్ని కొడితే భయపడతాను అనుకున్నారు. అంత పంతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తాం. ఆర్థిక మూలాల మీద కొట్టినంత మాత్రాన భయపడతామా? సినిమా టిక్కెట్ల అమ్మకంలో పారదర్శకత లేదంటున్నారు. మీ పరిపాలనలో పారదర్శకత ఉందా? ఉంటే కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఆ మాట అంటే బూతులు తిట్టిస్తారు. మీరు అమ్మ మందుకు
పారదర్శకత ఉందా? అంతా క్యాష్ అండ్ క్యారీ, ఏడాదిలో రూ. 40 వేల కోట్ల సంపాదన అంట. మన డబ్బులు తీసుకుని మన ఆరోగ్యాలు పాడు చేసి మళ్లీ మనకి అమ్ముతున్నారు. రూ. 700 పెట్టి మందుకొని రూ. 5తో సినిమాకు వెళితే సంతోషమా? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కనీసం ఒక్క ప్రాజెక్టుకు అయినా శిలాఫలకం వేశారా? 500 మంది సలహాదారులు ఉన్నారు. ఏమి ప్రయోజనం. స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపాలో తెలియదు. రాయలసీమలో వరదలు వచ్చాయి. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చాయి. ఏడుకొండల వాడు కూడా వీరిని భరించలేకపోతున్నాడు. తిరుమల వైసీపీని వద్దనుకుంటోంది. సొంత జిల్లా కడప దారుణంగా నష్టపోతే చిన్న ప్రాంతానికి వెళ్లి నవ్వుతూ నమస్కరించి వచ్చేస్తే సరిపోతుందా? ప్రధాన మంత్రి గారు నిజాయతీపరుడైన రాజకీయ నాయకుడు కాబట్టి కోవిడ్ లాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలంతా స్పందించి వేల కోట్లు ఇచ్చారు. అదే ప్రజలు వైసీపీకి ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితి. వీరి అవినీతి ప్రభుత్వం మీద నమ్మకం పోయేలా చేసింది. నీతి, పారదర్శకత ఉన్న నాయకుడు పాలకుడు కాకపోతే ప్రజల కూడా స్పందించరు, సొంత జిల్లాలో న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఎక్కడో విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ పోతుంటే ఏం స్పందిస్తారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. వైసీపీ కార్యకర్తలు చూట్లాడితే ఎదిరించండి. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు. పార్టీలుగా ముందుకు వస్తున్నాం. ప్రజా సంక్షేమం అనేసరికి జిల్లాలు, కులాలుగా విడిపోతున్నాం.

• బైబిల్ సూత్రాలు చదివి పాటించకపోతే ఎలా?

అమరావతి రైతులకు కూడా అందుకే జై ఆంధ్ర అని నినదించమని సలహా ఇచ్చాను. జై ఆంధ్ర అనకపోతే రాజధాని ఉద్యమం అన్ని జిల్లాలకు వెళ్లదు. స్టీల్ ప్లాంట్ మనందరిదీ అనే భావన ఉంది. ఇక్కడ కుల నిర్మూలన జరగకపోయినా కులాల మధ్య ఐక్యత తీసుకురావాలి. ఓ కులాన్ని వైసీపీ వర్గ శత్రువుగా ప్రకటించినప్పుడు తర్వాత వచ్చే వారు వైసీపీని వర్గ శత్రువుగా ప్రకటిస్తే పరిస్థితి ఏంటి? పొరుగువారిని ప్రేమించమని బైబిల్లో చెబుతారుగా.. టైబిల్ చదివి సూత్రాలు పాటించకుంటే ఎలా? దైవ సూత్రాలు ఆచరణలోకి తీసుకురాకుంటే ఎలా? జనసేన అది చేస్తుంది.. మతాల గురించి ఎక్కువ మాట్లాడదు. నా మతాన్ని ఆరాధిస్తా.. ఎదుటి మఠాన్ని గౌరవిస్తాం. జనసిన మత రాజకీయం చేయదు. లోటుపాట్లు మాత్రమే చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా పాలసీ తీసుకువస్తే హర్యానా, పంజాబ్ రైతులు వ్యతిరేకించారు. రైతులకు మంచిచేసిదే అయినా, రైతులకు నచ్చనప్పుడు శ్రీ మోదీగారు దాన్ని వెనక్కి తీసుకున్నారు. క్షమాపణ కూడా చెప్పారు. వైసీపీ వారు చేసిన తప్పును సరిదిద్దుకోరు. అది బరితెగించినతనం. రెండు వేలు ఇస్తే ఓట్లుకొనసుకోవచ్చన్న భావనే అందుకు కారణం.

• రైతు సదస్సులు నిర్వహిస్తాం.

శ్రీ దామోదరం సంజీవయ్య గారిలా ప్రతి గ్రామం నుంచి సామాన్యులు రాజకీయాల్లోకి రావాలన్నదే జనసిన లక్ష్యం. అధికారం అందరి చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో రైతుల సమస్యల మీద ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేసే ఖచ్చితంగా మాట్లాడుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అందుపులో ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్, బీహార్రా ష్ట్రాలను మించిపోయింది. ఎమ్మెల్యేలో రౌడీయిజం చేసి పరిస్థితి వచ్చింది. పాలకులే బూతులు తిడతారు. దూషణలకు దిగుతారు. శాసనసభ సాక్షిగా ప్రతిపక్షనేతను అయన సతీమణిని తిడితే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది. చట్టసభల్లో బూతులే శాసనాలుగా మారిపోయాయి. 2024లో జనసేన పార్టీ చేతికి శాంతి భద్రతలు అప్పగించండి. ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితులు తీసుకువస్తాం.. అన్నారు.అంతకు ముందు సాయంత్రం 5 గంటలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావంగా చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దీక్షను విరమించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు వెంకట్రావు, కేఎస్ఎన్ రావు, శ్రీ రామ్మోహన్ రావు, శ్రీ పితాని భాస్కరరావులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేత దీక్ష విరమింప చేశారు.దీక్ష అనంతరం కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గానికి చెందిన శ్రీమతి దోవారి పవిత్ర, గుంటూరు నగరానికి చెందిన వ్యాపారవేత్త శ్రీ నేరెళ్ల సురేష్ లు జనసేన పార్టీలో చేరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి కండువా కప్పి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ దీక్షా కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్టులు పాల్గొన్నారు.