అధికారం కోసం కాపులపై దొంగ ప్రేమ చూపిస్తున్న వైసిపి కాపు నాయకులు

ఈరోజు కాపులపై ప్రేమ ఉన్నట్లు కాపులను ఉద్దరించినట్లు కాపులను‌ మభ్యపెట్టి కాపుల ఓట్లతో గెలిచిన వైసిపి కాపు ప్రజాప్రతినిధులు కాపు మీటింగ్ పెట్టుకున్నారు. కారణం ఎక్కడ పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారో అని బయపడి, ఎలా అయిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా ఎలా పవన్ కళ్యాణ్ ని భగ్నం చెయ్యాలని. ఎందుకంటే వీళ్ళంతా జగన్ రెడ్డి కాపాలా కుక్కలు కాబట్టి, జగన్ రెడ్డి కుక్క బిస్కట్లకు వీళ్ళు అలవాటు పడ్డారు కనుక. ఈరోజు వంగవీటి మోహనరంగాపై దొంగ ప్రేమ చూపిస్తున్న ఈ కాపు జాతి ద్రోహులు ఈ వైసిపి పాలేరు కాపు నాయకులు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాని వైసిపి అధ్యక్షుడు జగన్ రెడ్డి అవమానపరిచినప్పుడు మాట్లడకుండా నోటిలో ఏమి పెట్టుకున్నారు అని అడుగుతున్నాను. వంగవీటి రంగాని చంపటం తప్పు కాదు అతను‌ రౌడి పాము అని పోల్చిన వైసిపి నాయకుడు గౌతమ్ రెడ్డి అన్నప్పుడు చెవులో ఎవరిది పెట్టుకున్నారు. మీ నాయకుడు జగన్ రెడ్డి గౌతమ్ రెడ్డి సస్పెన్షన్ చేసినట్లు చేసి సస్పెన్షన్ ఎత్తేస్తే దానిని‌ ఖండించకుండా ఎందుకు ఉన్నారు. మీ లాంటి లుచ్చలు వంగవీటి గారిపై ప్రేమ ఉన్నట్లు‌ మాట్లడుతున్నారు సిగ్గు అనిపించలేదా.కొంతమంది వంగవీటి రంగాని చంపిన పార్టీ టిడిపి అన్నారు‌. మరి అయితే ఆ పార్టీల్లో వున్నప్పుడు ఈ విషయం మీకు తెలియదా! ఇప్పుడు వైసిపి పార్టీలోకి పోయాక తెలిసిందా. నిజంగా చంద్రబాబు రంగాని చంపితే తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చంద్రబాబును అరెస్టు చెయ్యలేదు, రంగా హత్యలో రాజశేఖరరెడ్డి పాత్ర, కాంగ్రెస్ పాత్ర ఎంత ఉంది. దీని గురించి ఎప్పుడైన ఇప్పటి వైసిపి నాయకులు ప్రశ్నించారా? ఇది ప్రశ్నిచకుండా మీ‌ నంగనాచి డ్రామాలు అడతారా ఇలాంటి డ్రామలు ఎవరి దగ్గర అయిన ఆడండి కాపుల దగ్గర కాదు అని తెలియజేస్తున్న. ఇంకా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురించి‌ మాట్లాడతారు, అస్సలు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని పావుగా వైసిపి అధికారంలోకి రావడానికి వాడుకున్నది నిజం కాదా రైలు తగలపెట్టింది వైసిపి. అన్నివేళ్ళు వాళ్ళవైపు చూపిస్తున్నాయి. కాపు ఉద్యమాని పరోక్షంగా అణిచివేసి ఎంతోమంది కాపులు జైలు పాలు కావడానికి పరోక్ష కారణం వైసిపి అందుకే, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ కు మోగిన గంట జగన్ రెడ్డి అధికారంలోకి రాగనే నిలచిపోయింది. కాపులపై ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న వైసిపి కాపు నాయకులకు నిజంగా కాపులపై ప్రేమ ఉంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని జగన్ రెడ్డి అన్నప్పుడు ఎందుకు వైసిపిలో తిరుగుబాటు జెండా ఎగురవెయ్యలేదు తాడేపల్లి ప్యాలెస్ పాలేరు కాపు కుక్కలార. మీకు నిజంగా కాపులపై ప్రేమ వుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు అగ్రవర్ణపేదలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు రిజర్వేషన్ ఇవ్వమను ఈరోజు రాష్టంలో అగ్ర కులాలో అత్యధికంగా పేదలు వున్నది కాపు కులంలోనే ఇవ్వమను మీ నాయకుడు జగన్ రెడ్డిని కాపులకు రిజర్వేషన్. కాపులకు కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్ కు రు‌.2వేల కొట్లు ఇస్తాం అని మాట ఇచ్చి మాట తప్పితే ఇంత వరకు ఆ వైసిపిలో ఉండే కాపు నాయకులు ఎందుకు జగన్ రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నించలేదు. మీకు‌ కాపులపై ప్రేమ ఉందా సిగ్గులేని సన్నాసుల్లారా..! మీరా కాపుల గురించి‌, పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి మాట్లడేది. ఆంధ్రప్రదేశ్ లో కాపులు దాదాపు 25శాతం పైగా కాపులు ఉంటే 175లో‌ జగన్ రెడ్డి కాపులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది కేవలం 28 మందికి న్యాయం ప్రకారం కాపులకు ఇవ్వలసిన సీట్లు 40 సీట్లు పైనే ఇవ్వాలి‌‌ ఇచ్చారా..? లేదు. రాష్టంలో ఉన్న 25 ఎంపి సీట్లలో కాపులకు ఇవ్వలసింది న్యాయ ప్రకారం 6 సీట్లు కాని‌ ఇచ్చింది ముష్టి 3 ఎంపి సీట్లు. వీళ్ళు కాపులకు‌ న్యాయం చేస్తున్నారంటే సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. పవన్ కళ్యాణ్ సిఎం అయితే సంతోషిస్తాం అన్నారు కదా రండి మీకు నిజంగా కాపులై ప్రేమ ఉంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని‌ సిఎం చేద్ధాం. మీ నాయకుడు కాపుని సిఎం చెయ్యగలడా చెయ్యలేడు. రండి తాడేపల్లి పల్లి ప్యాలేస్ గేటుకు కాపలా కాసింది చాలు. కాపు కులాన్ని ఇప్పటి వరకు జగన్ రెడ్డికి మీ తాత్కాలిక పదవుల కోసం తాకట్టు పెట్టింది చాలని కొట్టే శ్రీహరి అన్నారు.