అభివృద్ధి అనే పదమే వైసీపీ నేతలకు తెలియదు

  • వైసీపీ నేతలకు దోచుకోవటంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
  • ఒక్కఛాన్స్ అంటే నమ్మి మోసపోయామన్న అపరాధభావనలో ప్రజలు
  • సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జనసేన పాలన
  • గుంటూరు నగరం జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ప్రజలు తమకు అధికారం ఇచ్చింది దోచుకోవటానికే అన్నట్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని, ఇసుక, మట్టివంటి సహజ వనరులను దోచుకోవటంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. ప్రజలకు కనీస మౌళిక వసతులు కల్పించటంలో పూర్తిగా ఫలమయ్యారని అభివృద్ధి అనే పదమే తమ పరిపాలనా డిక్షణరీలో లేదు అన్నట్లుగా నగరాభివృద్ధిని పూర్తిగా మరచిపోయారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 44వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేరేళ్ళ సురేష్ స్థానిక ప్రజల్ని కలుసుకొని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ సంక్షేమం వంకతో అభివృద్ధిని అటకెక్కించటం శోచనీయమన్నారు. రక్షిత మంచినీరు, సరైన రహదారులు, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించటంలో స్థానిక శాసనసభ్యుడు, కార్పొరేటర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్కఛాన్స్ పేరుతో జగన్ రెడ్డి చేసిన మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని, వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అన్న అపరాధ భావన ప్రజల్లో నెలకొందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ జనసేన అధికారంలోకి రాగానే పునర్నిమిస్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జనసేన సమపాలన చేస్తుందని, ప్రజలు పవన్ కల్యాన్ నేతృత్వంలోని జనసేనకు పట్టం కట్టాలని నెరేళ్ల సురేష్ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పార్వతి నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీ బిట్రగుంట మల్లికా, జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు శ్రీ పాకనాటి రమాదేవి, మరియు గుంటూరు నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర మరియు నగర కార్యదర్శులు, మరియు సంయుక్త కార్యదర్శులు, జనసేన పార్టీ వీరమహిళలు, మల్లేశ్వరి, కవిత, అనసూయ, చల్ల ఉష, మరియు, పలు డివిజన్లో అధ్యక్షులు, కిరణ్, సతీష్, నవీన్, సర్దార్, సైదా బాబు, చందు, హరికిరణ్, రాధాకృష్ణ, శివమణి, నాగలక్ష్మి, రూప్ చంద్, కళ్యాణ్, బెంజిమెన్, వంశి, అనిల్, 44 డివిజన్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.