అమీన్‌పూర్ జనసేన పార్టీ మండల కమిటీ నియామకం

పటాన్ చెరువు, రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు శుక్రవారం పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ జనసేన పార్టీ మండల కమిటీని పటాన్ చెరువు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ రాజేష్ యడమ నియమించడం జరిగింది. మండల కమిటీ సభ్యులకు శుక్రవారం నియామకపత్రాలను అందచేసారు. అనంతరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ రాజేష్ యడమ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.