అధికారాన్ని అనుభవించేది వైసీపీ నేతలు – ఉద్యోగాలను కోల్పోయేది మీరా..?

తిరుపతి, గతంలో జరిగిన తిరుపతిలోని పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కి, ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసి, అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి యొక్క సొంత స్వలాభం కోసం ఐఏఎస్ అధికారులతో సహా.. ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పోలీస్ అధికారులను వివిధ ఉద్యోగ సంఘాలను చట్టానికి వ్యతిరేకంగా వాడుకున్నారని, ఇందులో భాగంగా కొందరు ఐఏఎస్ లు, పోలీసు అధికారులు వారి ఉద్యోగాలను కోల్పోవడం జరిగిందని, వైసీపీ నేతలు ఉద్యోగుల చేత చట్ట వ్యతిరేక పనులు చేపించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారిని కనీసం పట్టించుకున్నారా అని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రానున్న ఎలక్షన్లలో అధికారుల ప్రలోభాలకు లొంగకుండా. ప్రతి ఒక్క ఉద్యోగి నిస్వార్ధంగా వారి, వారి విధులను నిర్వర్తించాలని, అధికారాన్ని అనుభవించేది వైసీపీ నేతలు అయితే, ఆ వైసీపీ నేతల చేతిలో చిక్కుకొని ఉద్యోగాలను కోల్పోయేది మీరేనని, దయచేసి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయిన సరే, అధికార పార్టీ నేతల వలలో పడవద్దని, మరో కొద్ది రోజులు మాత్రమే అధికార పార్టీకి వాలిడిటీ ఉందని, వారి వలలో పడి చేయకూడని పనులు చేస్తే పోయేది మీ ఉద్యోగాలేనని రాజారెడ్డి గుర్తు చేశారు. రేపు ఆంధ్ర రాష్ట్రంలో రానున్నది జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వమేనని, ఎక్కడికక్కడ ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుటకు గాను జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. 1998లో వెల్డింగ్ అసోసియేషన్ వర్కర్లకు ఆటోనగర్ నందు కేటాయించిన భూములను ఇప్పుడు రేట్లు పెరిగినందున తుడా అధికారులు ఆ భూములను షాపింగ్ కాంప్లెక్స్ ల పేరుతో వారినుంచి లాక్కోవాలని చూస్తున్నారన్నారు. వెల్డింగ్ అసోసియేషన్ వర్కర్లకు న్యాయం చేకూరే వరకు వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని వారితో కలిసి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతామని వెల్డింగ్ అసోసియేషన్ వర్కర్లకు జనసేన నేతలు హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు దినేష్ జైన్, రాజేష్ ఆచారి, హిమవంత్, కిషోర్, పవన్, మనోజ్, సాయి దేవ్, మణి తదితరులు పాల్గొన్నారు.