జనసేన పార్టీ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు వైసీపీ మానుకోవాలి: గొల్లపల్లి అనురాధ

రాయవరం: రాయవరం మండలం చెల్లూరు ఎంపీటీసీ శ్రీమతి గొల్లపల్లి అనురాధ స్వగృహం నందు గురువారం పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో అనురాధ మాట్లాడుతూ.. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని అతి కిరాతకంగా హత్య చేసి.. దానిని కప్పి పుచ్చడానికి దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లను సృష్టించారు.

ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ ఇంజన్ గంట సమయంలో వస్తుంది కానీ.. మంత్రి గారి ఇల్లు దహనం అయితే పూర్తిగా కాలి బూడిద అయినా ఫైర్ ఇంజన్ అక్కడ కనిపించలేదు. దీన్నిబట్టి అర్థం అవుతుంది. కుల రాజకీయాలు రెచ్చగొట్టి పార్టీ ఈ వైసిపి ప్రభుత్వం అని.

ఈ విధంగా ఉదయం నుండి అల్లర్లు జరుగుతాయని ఇంటిలిజెన్స్ సమాచారం ఉండి కూడా స్పెషల్ ఫోర్స్ ను అల్లర్లను అదుపు చేయడానికి ఎక్కడ కూడా పోర్స్ ను ఉపయోగించలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ అల్లర్లను సృష్టిస్తుందని జనసేన పార్టీ మీద వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, కులాలని కలిపే ఆలోచనా విధానం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని అనురాధ తెలిపారు.