అల్లూరి సీతారామరాజు కి నివాళులు అర్పించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: విప్లవ జ్యోతి, చిరస్మరణీయ పోరాట స్ఫూర్తి బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడినా విప్లవ యోధుడు, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మన్యం వీరుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మన జిల్లా వాసులు మన్యం ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడిన మహావీరుడు, స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పూర్తి చేసుకుని 126 లో ప్రవేశిస్తున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం నుండి నివాళులు అర్పిస్తున్నాం. పశ్చిమగోదావరి జిల్లా ముద్దుబిడ్డ, మహావీరుడు, పోరాటయోధుడు, అల్లూరి సీతారామరాజు కి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లి వారి యొక్క ఆశయ సాధన కోసం పేద, బడుగు, బలహీన వర్గాలకు ఈ సమాజంలో మెరుగైన జీవితాన్ని అందించే దిశగా ఆపదలో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున అండగా నిలుస్తూ రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని అటు వంగవీటి రంగా గారి పోరాట స్ఫూర్తిని, ఇటు అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని, జనసేనాని నీడలో ముందుకు నడుస్తామని వారికి ఏలూరు నియోజకవర్గం నుండి నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, పల్లి విజయ్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, నాగభూషణం, జనపరెడ్డి తేజ ప్రవీణ్, రాపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.