వైసీపీ విముక్త రాష్ట్రం ల‌క్ష్యంగా ప‌నిచేయాలి

  • ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న అపూర్వ ఆద‌ర‌ణే టీడీపీ- జ‌న‌సేన కూట‌మి విజ‌యానికి సంకేతం
  • య‌డ్ల‌పాడు జ‌న‌సేన పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌(య‌డ్ల‌పాడు): జ‌న‌సేన పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌లు చూపుతున్న ఆపూర్వ ఆద‌ర‌ణే రానున్న ఎన్నిక‌ల‌లో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి విజ‌యానికి సంకేత‌మ‌ని జన‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ తెలిపారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం య‌డ్ల‌పాడు మండలం పుట్ట‌కోట‌లో గ్రామ పార్టీ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం రాత్రి జ‌న‌సేన పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పెంటేల బాలాజీ మాట్లాడుతూ అధికార వైఎస్సార్ సీపీని ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడు సాగ‌నంపాలా అని ఎదురు చూస్తున్నార‌ని, ఈ క్ష‌ణంలో ఎన్నిక‌లు వ‌చ్చినా అంతిమ విజ‌యం టీడీపీ, జ‌న‌సేనా కూట‌మిదేన‌ని తెలిపారు. రాష్ట్రంలోనూ, చిలక‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోనూ రోడ్ల దుస్థితి దార‌ణంగా ఉంద‌ని మండి ప‌డ్డారు. ఉదాహ‌ర‌ణ‌కు బోయ‌పాలెం నుంచి పుట్ట‌కోట గ్రామానికి చేరుకోవ‌డానికి గుంత‌ల రోడ్ల‌తో నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని వివ‌రించారు. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఎన్నిక‌లకు ముందు ప్ర‌జ‌ల ముందుకు వచ్చార‌ని, ఎన్నిక‌ల అనంత‌రం ప్ర‌జ‌ల‌ను పూర్తిగా వదిలివేశార‌న్నారు. గెలిచిన వెంట‌నే విడ‌ద‌ల ర‌జిని గుంటూరుకు మ‌కాం మార్చి పాల‌న‌ను గాలికి వ‌దిలివేశార‌ని, ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ఎవ‌రో తెలియ‌ని దుస్థితి నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల కు ఆరునెల‌ల ముందే టికెట్ అమ్ముకొని గుంటూరుకు పారిపోయార‌ని ఎద్దెవా చేశారు. వైసీపీ విముక్త రాష్ట్రం ల‌క్ష్యంగా ప‌నిచేయాలి. వైసీపీ విముక్త రాష్ట్రం లక్ష్యంగా ప్రతి జన సైనికుడు రానున్న రెండు నెలలూ కష్టపడాలని పెంటేల బాలాజీ పిలుపు నిచ్చారు. జనసేన పార్టీ మొదటి నుంచి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిలబడింద‌న్న విష‌యం ప్ర‌జ‌లు గుర్తించారు కాబ‌ట్టే వారి నుంచి ఊహించ‌ని స్పంద‌న వ‌స్తుంద‌ని వివరించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్ళి ప‌నిచేయాల‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాటాల‌కు సిద్దం కావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా మొట్ట‌మొద‌టిసారిగా గ్రామంలో పార్టీ ఆవిర్బావానికి స‌హ‌క‌రించి, పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన గ్రామానికి తిరుప‌య్య‌కు ఆవిష్క‌రించిన జెండాను అంకిత‌మిచ్చి, ఆయ‌నకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. య‌డ్ల‌పాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు -మండల ప్రధాన కార్యదర్శి పాపాన హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్, సెంట్రల్ ఆంధ్ర ఎలక్షన్ కమిటీ కో కన్వీనర్ పెంటేల బాలాజి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాయపాటి అరుణ, ఆళ్ళ హరి, రాష్ట్ర వీర మహిళా విభాగం పాకనాటి రమాదేవి, గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబెర్ ఎల్ బి నాయుడు, గుంటూరు నాయకులు జ్యోతి, వీరమహిళా నాయకురాలు అమరేశ్వరి, సుమలత, ప్రసన్న, కోటేశ్వరమ్మ, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, యడ్లపాడు మండల అధ్యక్షులు గల్లా వెంకట్రావు, ఉపాధ్యక్షలు మల్లా కోటేశ్వరరావు, చిలకలూరిపేట మండల అధ్యక్షులు భాషా, ఉపాధ్యక్షులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి బొందలపాటి సుబ్బారావు, పెద్ద సంఖ్య‌లో వీర‌మ‌హిళ‌లు పాల్గొన్నారు.