పేద మహిళకి యూ అర్ ది పవర్ ఫౌండేషన్ సాయం

ఆత్మకూర్ నియోజకవర్గం: యూ అర్ ది పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జనసేన నేత శ్రీనివాస్ భరత్ అనంత సాగరము మండలం పరిధిలోని కామిరెడ్డి పాడు గ్రామంలోని ఓ నిరుపేద మహిళకి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూ అర్ ది పవర్ టీమ్ సభ్యులు జయ ప్రసాద్, బంకా రమణయ్య యాదవ్, రవి ఉదయగిరి, వాసు దేవ రెడ్డి, శ్రీనివాస్ కానగల తదితరులు పాల్గొన్నారు.