యువతే జనసేన పార్టీకి వెన్నుముక

ఉంగుటూరు: అన్ని పార్టీల కంటే యువత జనసేన పార్టీలోనే ఎక్కువుగా వున్నారని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు గారు పేర్కొన్నారు. ఆదివారం నారాయణపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి ఐ టి -వింగ్ సమావేశం జరిగింది. నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ధర్మరాజు, ఐ టి -వింగ్ కో ఆర్డినేటర్ అయితం ప్రసాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ధర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మధ్యమాలలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవ కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెవెళ్లే విధంగా పని చేయాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా మెరుగైన సమాచారాన్ని తీసుకెళ్లాలని పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తును ప్రజలకు వివరించాలన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఐ టి -వింగ్ చాలా బలంగా పని చేస్తుందని, గ్రామ స్థాయి నుండి ఐ టి -వింగ్ కమిటీలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం ఐ టి -వింగ్ కో ఆర్డినేటర్ అయితం ప్రసాద్ మరియు గ్రామ స్థాయి ఐ టి -వింగ్ కో ఆర్డినేటర్లు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు!.