జనసేనాని జన్మదినాన పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం జనసేన నాయకులు, జనసైనికులు, జనసేన వీరమహిళలు పలు సేవా, సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నీ వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కి ముందుగా శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం శ్రీనివాస్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. తదుపరి శ్రీనివాస్ చేతుల మీదుగా రక్తదానం శిబిరం ఏర్పాటుచేసి జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, ఐటీ వింగ్ సభ్యులు ఏపూరి సాయి, జనసేన నాయకులు పెనుబోతుల బాలాజీ, మరియు జన సైనికులు కాలేజీ స్టూడెంట్స్ 30 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన విందులో శ్రీనివాస్ పాల్గొని వారితో ముచ్చటించారు. పాతూరు యూత్ నల్లగంచు రాంబాబు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, సేవా కార్యక్రమంలో బాగంగా పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో శ్రీనివాస్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు జనసేనకు పార్టీ విరాళంగా అందజేశారు. శ్రీనివాస్ ఆ విరాళాన్ని జనసేన రైతు భరోసా కిందా పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమానికి అందజేస్తామన్నారు. జువ్వలపాలెం జనసేన నాయకులు పాలూరి బూరయ్య మరియు పాలూరి సందీప్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు జాన్సన్ బేబీ కిట్స్ మరియు హార్లిక్స్ సీసాలు, రోగులకు పళ్ళు మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన స్థానిక శ్రీదేవి పుంత దాసు కుటుంబానికి 20వేల రూపాయలు మరియు జువ్వలపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీనివాస్ చేతుల మీదుగా వారికి అందజేయడం, జనసేన జిల్లా నాయకులు రామిశెట్టి సురేష్ గుండుమోగుల సురేష్ మాదాసు ఇందు మరియు కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో స్థానిక తణుకు వెళ్ళే రోడ్ బస్టాండ్ నందు ఆటో కార్మికులకు వందకు పైగా యూనిఫాం చొక్కాలు అందజేశారు. అనంతరం కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో తణుకు రోడ్డు బస్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వీరమహిళలతో స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్ అనాధాశ్రమంలో నిత్యవసర వస్తువులు అందజేశారు. అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు బొలిశెట్టి శ్రీనివాస్ రోడ్డు మరమ్మతు పనులు చేశారు. అనంతరం రాచర్ల గ్రామ జనసైనికులు నెంబర్ వన్ మరియు నెంబర్ టు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జనసేన నాయకులు గాజులు గోపికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపాప్రసాద్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలూరి బూరయ్యా, పాలూరి సందీప్, ఏపూరి సాయి, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, భార్గవ్, దంగేటి చందు, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, మేది శెట్టి మాణిక్యాలరావు, ములగాల శివ, కాజురూరి మల్లేశ్వరరావు ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి జాన్ శెట్టి ప్రసాద్ సంతోష్, ధర్మేంద్ర వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, అడపా జమునా, మధు శ్రీ, విజయ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.