అల్లూరి సీతారామరాజు స్పూర్తితో వైసీపీ నేతల్ని తరిమికొట్టాలి

గుంటూరు, బ్రిటీష్ వాళ్ళ పరిపాలనను మించి అరాచకాలకు, అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన వైసీపీ నేతల్ని మన్యం వీరుడు అల్లూరి స్పూర్తితో తరిమి తరిమి కొట్టాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా శ్రీనివాసరావుతోటలో జనసేన నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగఫలమైన స్వాతంత్ర్య ఫలాలను అందరికి దక్కకుండా రాష్ట్ర పరిపాలన కొనసాగుతుండటం దురదృష్టకరం అన్నారు. వైసీపీ పాలనలో బ్రిటీష్ వారిని మించిన నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన ఆదివాసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అల్లూరి అని ఆళ్ళహరి కొనియాడారు. దళిత నాయకులు కొర్రపాటి మాట్లాడుతూ జీవితం సుదీర్ఘంగా కాదు గొప్పగా ఉండాలి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో అల్లూరి సీతారామరాజు జీవిత సారాంశం కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో రామిశెట్టి శ్రీను, కోనేటి ప్రసాద్, షర్ఫుద్దీన్, శేషు, సుబ్బారావు, చిన్నా, యూసుఫ్, అంజి, దాసరి రాము, తిరుపతిరావు, తేజ తదితరులు పాల్గొన్నారు.