వైయస్సార్ పార్టీ కి గడ్డుకాలం.. త్వరలో పార్టీ పతనం: ముఖరం చాంద్

కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం నందు జనసేన రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలను అడగగా.. ప్రజలు ఆయనకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారని ఇదే లాస్ట్ అని, పార్టీకి గడ్డుకాలం తప్పదని ఆయన అన్నారు. విపరీతంగా భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి.. ప్రజలందరూ గమనిస్తున్నారు.. ఈసారి వైసీపీ అధికారం వస్తే ప్రజల ఇల్లు కూడా లాక్కొని ఇది మా ఇల్లు అంటారు. దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి.. సిద్ధవటం ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. రోడ్డు విస్తరణ పేరుతో ఉన్న ఇల్లు కూల్చేసి.. పేద ప్రజలకు ఇంట్లో నిలువ లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. విస్తరణ పనులు కానప్పుడు ఎందుకు రోడ్డు పక్కన ఇల్లు పగలగొట్టాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయని ఆయన అన్నారు. అలాగే సామాన్య ప్రజలు ఇసుక కొనే స్థితిలో లేరని ఆయన అన్నారు. మా ప్రభుత్వం రాగానే ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న సిద్ధవటాన్ని రూపురేఖలు మారుస్తామని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న మైనారిటీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఒక్క సారి ముఖ్యమంత్రిని చేయండి అని అడిగాడు.. తీరా చేశాక ప్రజలకు త్రీడీ సినిమా చూపుతున్నాడు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఎక్కడ చూసినా భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువై వైయస్సార్ పార్టీ పై ప్రజలు విశ్వసనీయత కోల్పోయారు. చీప్ లిక్కర్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ లో మాట్లాడటం దయ్యాలు వేదాలు చెప్పినట్లు గా ఉంది. రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుంది.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ముఖరం చాంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కే రాజేష్ జనసైనికులు, ఆవుల రాజా, ఆవుల విశ్వ సొహైల్, మొండెం రాజా, సుబ్బయ్య మరియు శ్రీనివాస్ రెడ్డి అయ్యవారు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.