యువశక్తి ఆత్మీయ సమ్మేళనం

  • పాలకొండ జనసేన ఆధ్వర్యంలో యువశక్తి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి శ్రీకారం

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, పాలకొండ జనసేన నాయకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి హాజరైన జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులను, వీరమహిళలను కలిసేందుకు యువశక్తి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వీరఘట్టం మండలం, చలివేంద్రి గ్రామంలో శ్రీకారం చుట్టారు. ముందుగా యువత తో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిలుగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అల్లు సాయిరాం కుమార్, బి.పి.నాయుడు పాల్గొని యువతకు దిశ నిర్దేశం చేశారు. మీరు అందరూ మీ ఇంటిలోని తల్లిదండ్రులను, బంధువులకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించి వారిని కూడా జనసేన పార్టీలోని భాగస్వామ్యం చేయాలని కోరారు. జనసేన జాని, జామి అనీల్ లు మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ జనసేన పార్టీ తరుపున అభినందించారు. ఇదే ఉత్సాహంతో మీ గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. మత్స.పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు రక్షణగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ ద్వారా నియోజకవర్గానికి ఒక లాయర్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా బూతు స్థాయిలో ఐదు నుండి ఇరవై ఐదు మంది వరకు ఒక గ్రూపుగా ఏర్పడి రోజుకి ఒక గంట లేదా వారం కి ఒక రోజు మీ గ్రామంలో జనసేన పార్టీ మ్యానిఫెస్టోని, కౌలురైతులను ఆదుకుంటున్న విషయాన్ని, క్రియాశీలక సభ్యత్వం గురుంచి వివరించి, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తు కి ఓటు వేసేవిధంగా మార్పు తీసుకురండి. యువశక్తి కోఆర్డినేటర్ పొట్నూరు రమేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, అనిల్, చలివేంద్రి పంచాయతీ పరిధిలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.