గిరిజన ఐక్య సంఘాల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

అల్లూరిసీతారామరాజు జిల్లా, పాడేరు సమీకృత గిరిజన అభివృద్ధి శాఖ(ఐ.టి.డి.ఏ) ఎదుట ప్రజా ఐక్య సంఘాలు చేపట్టిన రిలే నిరసన 31వ రోజుకి చేరుకుంది. ఈ సందర్బంగా గిరిజనఐక్య సంఘాలకు మద్దతు తెలిపిన నాయకులు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య మరియు మండల స్థాయి నాయకులు. ఈ సందర్బంగా డా. గంగులయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిదంగా ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితికి ప్రభుత్వం ప్రధాన కారణం హెల్త్ వర్కర్స్ వ్యవస్థ రద్దు చేయడం కారణంగానే ఇటువంటి పరిస్థితులు వచ్చాయని గిరిజన ప్రజలు గుర్తించాలి. అలాగే మాతృభాష విధ్యా వాలంటీర్లు తొలగింపు చేసి విద్యార్థులని తమ మాతృభాష విద్యకు దూరం చేయటం. ఈ మధ్య గిరిజన ప్రజల స్థితిపై సిత్తశుద్ది లేని ప్రాజెక్ట్ ఆపిషర్ చేసే నిర్వహకం గిరిజనుల్లో ఆగ్రహం చవిచూస్తున్నారు. గిరిజనాభివృద్దికి తోడ్పకుండా పని చేసే అధికారుల్ని వేధించడం వంటి పనులు చేస్తున్నా ప్రాజెక్ట్ ఆఫీసర్ రోనాంకి గోపాలకృష్ణని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఊడిగం చేసే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఏమై పోయారని ప్రజలు గమనించాలని గిరిజన వ్యతిరేకత ఉన్న సమస్యలపై ఎందుకు దృష్టి చారించట్లేదని, ఈ అంశాలపై ఎందుకు స్పందించారని నిలదీశారు. గిరిజన ఐక్య సంఘాలకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని ఇకపై కూడా తోడుంటామని చెప్పారు. ఈ దీక్ష శిబిరానికి జనసేన పార్టీ ఇన్చార్జ్ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్, డా..వంపురు గంగులయ్య, కమల్ హాసన్, అశోక్, సంతోష్, నాగేష్, కిల్లో అశోక్, గిరిజనప్రజా ఐక్య సంఘాల నేతలు కూడా రాధ కృష్ణప్రభు కిల్లో, చలపతి పాంగి, చిన్నారావుపాంగి, సుందర్రావు లింగేటి పలువురు నేతలకు సంగిభావం తెలిపారు.