రైతన్నల ఉద్యమానికి సంఘీభావంగా కేరళలో ట్రాక్టర్‌ ర్యాలీ

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు పాప్‌ సార్ట్స్‌ స్పందించినప్పటికీ.. వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఆసక్తి కనబర్చడం లేదని దుయ్యబట్టారు. భారత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచ మొత్తం చూసిందని, కానీ ఢిల్లీలో ఉన్న పెద్దలు..వారి ఆవేదనను అర్థం చేసులేకపోతున్నారని విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా కేరళలో ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టిన అనంతరం ఆయన ఓ బహిరంగ సమావేశంలో ఈవిధంగా మాట్లాడారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణాన ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కోజికోడ్‌ విమానం ప్రమాద బాధితులను కలిశారు. కాగా, హస్తిన సరిహద్దుల్లో కర్షకులు చేపడుతున్న ఆందోళనలు 85 రోజులు దాటాయి.