మమతను ఎవరూ నెట్టలేదు: ప్రత్యక్ష సాక్షుల వీడియోలు

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందని, ఆమె కాలికి పూర్తిగా గాయ‌మైంద‌ని ఆమె పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఆమె కాలికి గాయం అయింద‌ని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టి ఉన్న ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

నందిగ్రామ్‌లో ఓ ప్రాంతంలో మ‌మ‌తపై దాడి జ‌రిగింద‌ని టీఎంసీ నేత‌లు అంటుండ‌గా, అదే స‌మ‌యంలో అక్కడ ఉన్న కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం అస‌లు ఆమెకు అక్క‌డ ఏమీ కాలేద‌ని చెబుతున్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో వాళ్లు మాట్లాడుతూ.. మమతను ఎవరూ తోయలేదని, ఆమెను చూడటానికి భారీగా జనం వచ్చారని సౌమెన్ మైతీ అనే విద్యార్థి చెప్పాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని కూడా అతడు చెప్పాడు.

మరో ప్రత్యక్ష సాక్షి చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి కూడా ఇదే మాట చెప్పడం గమనార్హం. కారు వెళ్తున్న సమయంలో ఆమె సీట్లో కూర్చున్నారు. అయితే డోర్ మాత్రం తెరిచే ఉంది. ఆ తర్వాత ఆ డోర్ పోస్టర్‌కు తగలడంతో అది మూసుకుపోయింది. అంతే తప్ప మమతను ఎవరూ తోయలేదు, ఆమెపై చేయి చేసుకోలేదు అని చిత్తరంజన్ దాస్ స్పష్టం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *