బైడెన్, జిన్‌పింగ్ భేటీ- కీలక అంశాలపై చర్చ!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది. వర్చువల్‌గా సమావేశమైన ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఈ భేటీ ప్రారంభంలో జిన్‌పింగ్‌తో బైడెన్ అన్నారు.
తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్‌పింగ్ బైడెన్‌తో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్‌తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.
ఇదే తొలిసారి.. గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో చైనా ఉపాధ్యక్షునిగా ఉన్న జిన్‌పింగ్‌ను బీజింగ్‌లో కలిశారు. ఇద్దరు కలిసి నూడిల్స్ కూడా తిన్నారు. సరదా సంభాషణ జరిపారు. ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో ఇరువురూ ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారు. అయితే అధ్యక్ష హోదాలో వారివురూ అధికారికంగా సమావేశమవడం ఇదే తొలిసారి.