“మా స్కూలు మాకే కావాలి” గేయం – ఈశ్వర ప్రసాద్ పారనందుల

“మా స్కూలు మాకే కావాలి” అంతు విద్యార్ధుల తరపున ఈశ్వర ప్రసాద్ పారనందుల ఒక గేయం రచించి ఆలపించారు. ఆ గేయంలో పల్లవి చరణాలు మీకోసం.

పల్లవి:-
పలక పట్టిన చేయి పోరుకు నడవంగా
బలపం దిద్దిన చేయి బాటలు వేయంగా
బ్యాగులుమోసిన భుజము ఉద్యమించకదిలేనో
పసితనము తిరుగుబాటు చేసేనో
చిరునవ్వులు నినదిస్తూ గర్జించెనో
బెల్టులు బూట్లు మాకొద్దు-వద్దు
అమ్మఒడి మాకొద్దు-వద్దు
ప్రయివేట్ సదువులు మాకొద్దు.2
మా స్కూలు మాకే కావాలి-మా స్కూలు మాకే కావాలి
మా స్కూలు మాకే కావాలి అంటు నిరసన గళమెత్తి నిప్పులు చేరిగెనో

చరణం:-1
ఉద్యమ విద్యుత్ నెలిగించిన నేటి ఈ బాలలో
తప్పులే ఎత్తిసూపిన రేపటి పౌరులో
చిరుతను సుట్టుముట్టిన గోవుల మందలై
పామునే మట్టుబెట్టిన చీమల దండులై
పొద్దుకే పొద్దుపొడిచిన రేపటి సూర్యులో…
విద్యార్థి వీరులో….
నెత్తురే ధారపోసిన అల్లరి కూనలో…
మా అక్షర జ్యోతులో…
బెల్టులు బూట్లు మాకొద్దు-వద్దు!!
అమ్మఒడి మాకొద్దు-వద్దు
ప్రయివేట్ సదువులు మాకొద్దు.2
మా స్కూలు మాకే కావాలి-మా స్కూలు మాకే కావాలి
మా స్కూలు మాకే కావాలి అంటు నిరసన గళమెత్తి నిప్పులు చేరిగెనో

చరణం2:-
యేండ్లనాటి చరిత్ర కలిగిన “ఎయిడెడ్ స్కూల్స్” రా..
విద్యార్థుల విద్యకోసము ప్రజలు నిర్మించేగా
జీవోల పేరిట ప్రభుత్వము పెట్టెను ఖర్చురా..
కుట్రపన్ని కూల్చవచ్చెరా ప్రజల ఆస్తి దోచగా
అమ్మఒడి అమలుకోసము అమ్మకానికి బడి
పేదమధ్య తరగతి జనము మోయలేని భారమిది
జీవోనెంబర్42,50రద్దును చెయ్యాలే ఫీజులు తగ్గించాలె
ప్రయివేటికరణనపి పాతపద్దతినుంచాలే రాజ్యం వెనక్కి తగ్గాలే
బెల్టులు బూట్లు మాకొద్దు-వద్దు!!
అమ్మఒడి మాకొద్దు-వద్దు
ప్రయివేట్ సదువులు మాకొద్దు.2
మా స్కూలు మాకే కావాలి-మా స్కూలు మాకే కావాలి
మా స్కూలు మాకే కావాలి అంటు నిరసన గళమెత్తి నిప్పులు చేరిగెనో

                                     -ఈశ్వర ప్రసాద్ పారనందుల