మహారాష్ట్రలో మెడికల్ సీట్ల భర్తీపై కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు మెడికల్ సీట్ల అడ్మిషన్లను 70:30 కోటా కింద భర్తీ చేసేవారు. అయితే ఆ విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ ప్రకటన చేసారు. ఇప్పట్నుండి నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను ఇవ్వనున్నారు. 70:30 కోటా ప్రకారం… 70 శాతం సీట్లను మెడికల్ కాలేజి ఉన్న జిల్లావాసులకు, మిగతా సీట్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారికి ఇస్తారు. అయితే మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజ్ లు ఉండటంతో ఆ ప్రాంతవాసులు నష్టపుతున్నారు. ఈ విషయంపై కొన్నేళ్ల నుండి విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 70:30 విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.