కెనడా ఎన్నారై బృందానికి అభినందనలు

జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనడాలోని జన సైనికులు విరాళంగా రూ.14 లక్షలను అందజేశారు. ఈ మొత్తాన్ని మన దేశంలోని బ్యాంకుల ద్వారా జనసేన ఖాతాకు బదిలీ చేశారు. ఈ విరాళాలను అందించిన జన సైనికులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీకి ఎన్. అర్. ఐ. లు చేస్తున్న సేవ తనకు ఎంతో సంతోషాన్ని కలుగ చేస్తోందని పేర్కొన్నారు.