ప్లాస్మా దానానికి ముందుకొస్తున్న ధారావి ప్రజలు

ధారావి ప్రజలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి వివరాలలోనికి వెళ్ళగా… కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా ఉన్న ముంబైలోని మురికివాడ ధారావి…ఇప్పుడు కరోనాపై పోరుకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ముంబై నగరానికి ప్లాస్మా డొనేట్ చేయడంలో ఈ మురికివాడ ముందుంది. ధారావిలో కరోనా సోకి కోలుకున్నవారిలో ఇప్పటికే 25శాతం మంది ప్లాస్మా డొనేట్ చేసేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడి ప్రభుత్వ స్కూల్లో శివసేన ఎంపీ రాహుల్ షెవాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ క్యాంపులో చాలామంది ప్లాస్మా దానం చేశారు. ఉండేది మురికివాడ అయినప్పటికీ… గొప్ప మనసుతో వాళ్లు ప్లాస్మా దానానికి ముందుకొస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో 10లక్షల పైచిలుకు జనాభా నివసిస్తారు. ఇప్పటివరకూ ఇక్కడ 2530 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇందులో 500 మంది ప్లాస్మా దానానికి ఒప్పుకున్నారు. మరికొంతమంది కూడా ప్లాస్మా దానానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్లాస్మా దానం చేసిన ధారావి ప్రజలను ముంబై మున్సిపల్ కమిషనర్ సత్కరించి అభినందించారు.