ఎపిలో జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఇళ్ల స్థలాల పంపిణీ 39 శాతం పూర్తయిందని సీఎం జగన్ తెలిపారు. 17 వేలకు పైగా కాలనీల్లో 9 వేల 668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని..మిగిలినవాటిని పూర్తి చేయాలి అధికారులను ఆదేశించారు.

కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్ని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పరిపాలనలో పారదర్శకతను పెంచామని.. భవిష్యత్‌లో కొనసాగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాల్ని కూడా కల్పించాలని తెలిపారు జగన్. కాలనీ పరిణామాన్ని బట్టి మౌళిక సదుపాయాల్ని కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం గానీ, ఇళ్ల పట్టాల పంపిణీ గానీ జనవరి 20 వరకూ కొనసాగనున్నాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.