కృష్ణా జిల్లాలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పారా ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (పీఎంఓఏ) పోస్టులకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం పోస్టులు 40

పోస్టు పేరు – పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్(PMOA)

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

జీతం: నెలకు రూ.15,000

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 8, 2021

చిరునామా: డీఎంహెచ్ఓ, కృష్ణా, మచిలీపట్నం, ఏపీ. వయసు: డిసెంబర్ 1,2020 నాటికి కనిష్టంగా 15 ఏళ్లు ఉండాలి, గరిష్ట వయసు 42 మించకూడదు.

విద్యార్హతలు : ఎంపీసీ/ బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. కింది వాటిలో ఏదైనా కోర్సు చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో అభ్యర్థి తప్పనిసరి రిజిస్టర్ అయి ఉండాలి.

ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్సు పూర్తి చేయాలి.

ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు చదివి ఉండాలి.

Andhra Pradesh ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణత సాధించాలి.

పూర్తి వివరాల కోసం Official Website – https://krishna.ap.gov.in/ లో చెక్ చేసుకోండి