నూతన విద్యా విధానం అమలు పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: సిరిపురపు రాజబాబు

కృష్ణా జిల్లా: నూతన విద్యా విధానం అమలు పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కోరుకొల్లు మాజీ సర్పంచ్ సిరిపురపు రాజబాబు హితవు పలికారు. బుధవారం ఆయన స్థానిక పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నూతన విద్యా విధానమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక విద్యలో అమలు చేస్తున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలతో ముఖ్యంగా ప్రాధమిక విద్య అభ్యసిస్తున్న విధ్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాల్లో తీవ్ర అయోమయం నెలకొందనీ ఈ విధానంలో పాఠశాలలను మూసివేయబోమంటూనే ప్రభుత్వం దూరంగా ఉన్న ఉన్నత పాఠశాల్లో విలీనం చేయడం సరికాదని.. నూతన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారనీ ఇలా ఇప్పటికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 250 మీటర్ల దూరంలోని 3,627 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను సుమారు 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి ఇప్పుడు కిలోమీటరు దూరంలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను వేరే బడులకు బదిలీ చేస్తూ ఇదికాకుండా 6, 7, 8 తరగతుల్లో 100లోపు విద్యార్థులు ఉంటే వీరిని 3 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారనీ దీనిపై ప్రస్తుత బడుల్లో చదువుతున్న విద్యార్థులు తమ బడులను వేరేచోట్ల విలీనం చేయడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ దీనికోసం తల్లిదండ్రులు తమ పిల్లలు కొత్త పాఠశాలలకు కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ మద్యలో రోడ్లు, చెరువులు దాటుకుంటూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మార్గమధ్యంలో పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాపోతున్నారనీ ముఖ్యంగా దీనివల్ల ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కూడా ఉందనే విషయం ప్రభుత్వం గ్రహించాలని కోరుతున్నారు. ఇలా క్రింద తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేయాలంటే ముందుగా పాఠశాల విద్యాకమిటీ మరియు పిల్లల తల్లిదండ్రులతో ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక సమావేశం జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఎక్కువ చోట్ల ఆ నియమాలను గాలికి వదిలేసిన ఉపాధ్యాయులు పైఅధికారుల కఠిన ఆదేశాల మేరకు రికార్డులు తయారు చేసి కొత్త బడుల్లో చేరాలని పిల్లలకు టీసీలు ఇచ్చేస్తూ చేతులు దులుపుకోవడం విచారకరమని దీనిపై గతంలో సర్వ శిక్షాభియాన్ పేరిట విద్యార్థులకు కిలోమీటర్ లోపు పాఠశాల ఉండాలంటూ పాఠశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు నూతన విద్యావిధానం అంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయమో పునరాలోచన చేసుకోవాలని.. ఎందుకంటే ఈ విధానంలో టీసీలు తీసుకున్న కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చకుండా గత్యంతరం లేక తమ ఇళ్ళకు దగ్గర్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని.. దీని వల్ల ప్రభుత్వం నుంచి అమ్మ ఒడి పధకం ద్వారా లబ్ది పొందుతూ వాటిని కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. దీనిని నివారించడానికి వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేలా ప్రోత్సాహించడానికి విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇంటింటికి రేషన్ అందించడం కోసం వాహనాలు ఏర్పాటు చేసిన విదంగా ఈ విద్యార్థులను స్కూళ్లకు తీసుకుని వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కాబట్టి ఈ విషయంలో ప్రజాప్రతినిధులు భేషజాలకు పోకుండా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ అధికారులతో చర్చించేలా ముఖ్యంగా నూతన విద్యావిధానం అమల్లో ఉన్న లోపాలు సరిచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాజబాబు డిమాండ్ చేశారు.