జె.రామారావుపేటలో నాడు-నేడు కార్యక్రమ క్షేత్రస్థాయి పరిశీలన

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమ క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం సయ్యద్ మొయీన్ ఆధ్వర్యంలో జగన్నాధపురం, జె.రామారావుపేట ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న మునిసిపల్ ఉర్దూ పాఠశాలని సందర్శించారు. అక్కడున్న స్థానికులు శశిధర్ తో మాట్లాడుతూ ఇక్కడ గతంలో ఉర్దూ స్కూల్ నిర్వహించేవారనీ, బిల్డింగు బాగోలేదని కొత్తది కడతామంటూ వేరే దూరప్రాంతంలోని స్కూలులో మార్చారని చాలా కాలం అయినా ఇప్పటిదాకా పూర్తిచేయడంలేదని ఫిర్యాదు చేసారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ గత కొన్ని రోజులుగా తాను కాకినాడ సిటిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించడం చేస్తున్నామనీ, ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయన్నారు. అసలు శిధిలమవ్వాలంటే సరియైన మైంటెనన్స్ చేయకుండా నిర్లక్ష్యం చేయడమే కారణమనీ, పొనీ ఉపయోగానికి ప్రమాదకరంగా ఉంటే వేరే కొత్త భవనం నిర్మించి అందులోకి మారుస్తామంటే సంతోషమే అనీ, కానీ ఎక్కడో దూరంలో ఉన్న స్కూలులో విలీనం చేయడమేంటని ప్రశ్నించారు. తీరా మార్చాకా సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు పూర్తికాకపోవడం చూస్తుంటే యేంటి ఈ వై.సి.పి ప్రభుత్వ నిర్లక్ష్యం అని దుయ్యబట్టారు. తీరా చూస్తే మార్చిన స్కూలులో సరిపోక అక్కడా నిర్వహించడంలేదని, అసలే అతితక్కువ ఉర్దూ పాఠశాలలు నగరంలో ఉన్నాయనీ, ఇప్పుడు వాటిని కూడా చెత్త కారణాలతో కుదించడమంటే ముస్లిం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోడమే అని తీవ్ర ఆందోళణ వెలిబుచ్చారు. మైనారిటీలపై ఈ వై.సి.పి ప్రభుత్వానికి ఉన్న నిజమైన ప్రేమ ముఖ్యమంత్రికి ఇదే అని దెప్పిపొడిచారు. తక్షణమే ఇక్కడ కొత్త భవనం పూర్తిచేసి, పూర్వంలా స్కూలుని పునరుద్ధరించాలని వై.సి.పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ముస్లిం నాయకులు జమీల్, ఎం డి. కాజామొద్దీన్, అజార్, కరీముల్లా, షులా, హాజీమస్తాన్, ఎం డి షరీఫ్, అబ్డుల్, కాష్మీరాఖాన్, తాజుద్దీన్లు శశిధర్ తో సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదార్శి వాశిరెడ్డి శివ, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, సిటీ వైస్ ప్రెసిడెంట్స్ అడబాల సత్యనారాయణ & ఓలేటి రాము, సిటి నాయకులు మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు, పెసంగి రాజేష్, షమీర్, వార్డు అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, మనోహర్ గుప్తా, నాయకులు అగ్రహారపు సతీష్, తోట కుమార్, భగవాన్, చీకట్ల వాసు, నూకరాజు, మల్లేశ్వరరావు, వీరమహిళలు బట్టు లీల, మాలతి తదితరులు పాల్గొన్నారు.