జగన్ భజన కోసమే.. ప్లీనరీ సభ: జనసేన విమర్శ

పాలక పార్టీ వైసిపి, స్వర్గీయ మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజున శుక్రవారం జరుపుకున్న ప్లీనరీ సభ.. సీఎం జగన్ భజన సభగా సాగిందని, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ప్రెస్ క్లబ్ లో శనివారం విమర్శించారు.. జనసేన నేతలు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, ఆకెపాటి సుభాషిని, కీర్తన, అమృత, లక్ష్మీ, మునస్వామి, నవీన్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. తమ జనసే నాని సభలకు స్వచ్ఛందంగా లక్షల్లో అభిమానులు తరలివచ్చారని.. వైసిపి ప్లీనరీకి విందు భోజనం ఆశ చూపి కార్యకర్తలను తరలించుకు వెళ్లారని విమర్శించారు.. పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుండి అమ్మనే రాజీనామా చేయించాడని.. ఇక వైసీపీ ప్రధాన శ్రేణులు ఎంత అని ఎద్దేవా చేశారు.. ఐరన్ లెగ్గు రోజా (పర్యాటక శాఖ మంత్రి) ఎక్కడ రిబ్బన్ కట్ చేసిన ప్రారంభించినా.. వెంటనే దివాలా తీయాల్సిందేనని చురకలు విసిరారు … తమ నేత పవన్ ను రోజా సవాల్ విసిరిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని.. నగిరిలో రోజా ఒంటరని, ఈసారి రోజాకు సీట్ ఇస్తే తాము పని చేయమని, (వైసిపి మరోవర్గం) కసిగా ఉందని.. మరోసారి నగిరిలో గెలవగలరా అని రోజా పై సవాల్ విసిరారు.