పబ్‌జీ గేమ్ ప్రియులకు శుభవార్త.. భారత్ లో పబ్‌జీ పునరాగమనం..

ఇండియాలోని పబ్‌జీ ప్రియులకు శుభవార్త. నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్‌ తిరిగి ‘పబ్‌జీ: న్యూ స్టేట్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్‌ చేశారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ లో దీని సైజ్‌ దాదాపు 1.4జీబీ గా ఉంది. ఆండ్రాయిడ్‌ 6 ఆపై వర్షన్లలో మాత్రమే ఈ గేమ్‌ ఆడొచ్చు. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు ఈ గేమ్ సృష్టికర్త క్రాఫ్టన్‌ సంస్థ చెబుతోంది. భారత్‌ లో పబ్‌జీ గేమ్‌కు చాలా క్రేజ్ ఏర్పడింది. అప్పట్లో చాలా మంది ఈ గేమ్‌ కు అడిక్ట్ అయ్యారు. అయితే, చైనాతో వివాదం నేపథ్యంలో గతేడాది పబ్‌జీని భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాలోని యూజర్ల కోసం క్రాఫ్టన్‌ సంస్థ ‘బ్యాటిల్‌గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా(బీజీఎంఐ) పేరుతో ప్రత్యేకంగా దేశీయ గేమ్‌ ను రూపొందించింది. పబ్‌జీలో మార్పులు చేస్తూ.. సరికొత్త ‘పబ్‌జీ: న్యూ స్టేట్‌’ గేమ్‌ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.