HECL 164 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల (టెన్త్‌ క్లాస్ అర్హత)

హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HECL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 164 ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు:

ఎలక్ట్రీషియన్‌ – 20

ఫిట్టర్‌ – 40

మెషినిస్ట్‌ – 16

వెల్డర్‌ – 40

కోపా – 48

ముఖ్య సమాచారం:

అర్హత: ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు)

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5, 2020

దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 29, 2020

వెబ్‌సైట్‌:http://www.hecltd.com/