ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీ కోఆర్డినేటర్స్ ఆత్మీయ సమావేశం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆఫీసులో జిల్లా ఐటీ కోఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ ఆధ్వర్యంలో 19 నియోజకవర్గాల ఐటీ కోఆర్డినేటర్లు సమావేశమయ్యి ఐటీ టీమ్ విధి విధానాలు మరియు ఐటీ టీం మండల గ్రామ స్థాయి విస్తరణ మీద చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా అస్త్ర యాప్ ని జనంలోకి ఏ విధంగా తీసుకు వెళ్ళాలి, మండల గ్రామ స్థాయిలో నిబద్దతతో పార్టీకి పనిచేసే వాలంటీర్స్ ని ఎలా గుర్తించాలి, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గ ఇంచార్జిలకు ఐటీ టీం సహాయ సహకారాలు అందించే విధానాల గురించి చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమానికి 19 నియోజకవర్గాల ఐటీ కోఆర్డినేటర్స్ హాజరై వారి సలహాలు సూచనలు తెలియచేసారు.