జనసేనానిని కలిసిన మాగంటి బాబు, బూరగడ్డ వేదవ్యాస్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి మాగంటి బాబు గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పవన్ కళ్యాణ్ గారితో మాజీ డిప్యూటీ స్పీకర్, సీనియర్ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ సమావేశం అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు.