గిద్దలూరు జనసేన ఆధ్వర్యంలో రెండవరోజు డిజిటల్ క్యాంపెయిన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ద్వంశమైన రోడ్ల పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలిసేలా మరియు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి మేల్కొనేలా పిలుపునిచ్చిన #GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కంభం మండలంలో రావిపాడు గ్రామంలో పర్యటించిన గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు

ఇంఛార్జి బెల్లంకొండ మాట్లాడుతూ రావిపాడు బ్రిడ్జి దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించారు, అధిక బరువు గల వాహనాలు ఇసుక, కంకర తిప్పర్స్ రావడం వలన బ్రిడ్జి కృంగినది, వాగు ఉదృతంగా వచ్చినప్పుడు ట్రాక్టర్కూడ కొట్టుకుపోయింది,ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు, బ్రిడ్జి మీద గోతుల్లో వాటర్ నిలిచి వున్నది, ప్రజల కోసం వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే జనసేన పార్టీ అధికారం వచ్చిన తరవాత బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు లంకా నరసింహా రావు, కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, రాచర్ల నాయకులు సిద్దం వెంకటేశ్వర్లు, కంభం మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, శ్రీపతి కాశయ్య, పిక్కిలి కాసయ్య, మీనిగ కాశిరావు, నల్లబోతుల శివయ్య, అర్ధవీడు మండల నాయకులు బైరా శేషాద్రి నాయుడు, శ్రీపతి కృష్ణయ్య, కొంకల రంగస్వామి, బెస్తవారపేట మండల నాయకులు ఇళ్ళురి అనిల్ కుమార్, కువ్వారపు దేవరాజు, తోటకురి కొండయ్య, బుక్క ఓబయ్య, బోయళ్ళ పవన్ కుమార్, రెడ్డిమోయిన బాబు, కోవెలకుంట్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.