కరోనాను జయించిన స్టార్ హీరో సూర్య..

స్టార్ హీరో సూర్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెల్సిందే.. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తెలిపాడు. తమ అభిమాన హీరో కరోనా బారిన పడ్డాడని తెలిసి సూర్య ఫ్యాన్స్ కంగారుపడ్డారు. అయితే ఇటీవలే సూర్య సోదరుడు హీరో కార్తీ సూర్య హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపాడు. ఇప్పడు నిర్మాత రాజశేఖర్ పాండియన్ సూర్యకు నెగిటివ్ వచ్చిందని, ఇప్పడు ఆయన కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దాంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.