విశాఖ వీరమహిళలు, జనసైనికుల తెగింపు స్ఫూర్తిదాయకం

* ఎట్టి పరిస్థితుల్లోనూ మనో ధైర్యాన్ని కోల్పోవద్దు
* కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే జనసేన న్యాయ విభాగం తోడ్పాటు అందిస్తుంది
* జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు

విశాఖపట్నం జిల్లాలోని వీర మహిళలు, జనసైనికుల తెగింపు పార్టీకి స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో నియోజకవర్గాల వారిగా జరిగిన సమావేశాల్లో నాగబాబు గారు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. కార్యకర్తలు సామాజిక అంశాలపై న్యాయ బద్దంగా పోరాడుతుంటే వారిపై కేసులు మోపి బెదిరింపులకు గురి చేయడం వై.సీ.పీ. నేతలకు పరిపాటిగా మారిందని అన్నారు. ఓటమి పాలు అవుతామేమో అనే భయంతో వై.సీ.పీ. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. వై.సీ.పీ. నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు సహనం, మనో ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే జనసేన న్యాయ విభాగం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచక పాలన చేస్తున్న వై.సీ.పీ. నేతలు చేస్తున్న దౌర్జన్యానికి సిద్ధాంత పరమైన పోరాటం చేస్తున్న మనం భయపడాల్సిన పనిలేదు అని చెప్పారు. కార్యకర్తలు అంతా పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో, నియోజకవర్గం బాధ్యులతో సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్, గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం వెస్ట్, భీమిలి, అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, చోడవరం, ఎలమంచిలి, పాడేరు, అరకు, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.