ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్

ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ను భారతీయ రైల్వే మణిపూర్ లో నిర్మించనుంది. మణిపూర్ లోని నోని జిల్లాల్లో ఇజాయ్ నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి కోసం నిర్మించే పిల్లర్ల ఎత్తు 141 మీటర్లు ఉండబోతోంది. యూరోప్ లోని మాంటెనెగ్రోలో మాలా రిజేకా బ్రిడ్జ్ ఎత్తు 139 మీటర్లు కాగా ప్రస్తుతం అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రికార్డులో ఉంది.

దీనిని మణిపూర్ లో నిర్మించే బ్రిడ్జ్ త్వరలోనే క్రాస్ చేయనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.280 కోట్లు ఖర్చు అవనుంది. దీనిని మార్చి 2022 వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ లో అత్యంత ఎత్తైన బ్రిడ్జి ప్రస్తుతం కోంకణ్ రైల్వే కు చెందిన రత్నగిరి పన్వాల్ లో ఉంది.

మారుమూల గ్రామాల కూడా రైల్వే ను తీసుకువెళ్లాలి అనే సంకల్పంతో దేశంలోనే అనే కొత్త మార్గాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో ప్రజా రవాణా నేటికి పెద్ద సమస్యగా మిగిలిపోయింది. దీని అదిగమించడానికి రైల్వే కొత్త మార్గాల అన్వేషణ చేస్తూ అందులో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని కొత్త మార్గాల్లో రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది.

ఇజాయ్ నదిపై నిర్మించనున్న ఈ బ్రిడ్జి ఇంజినీరింగ్ అద్భుతంగా నిలవనుంది. ఒక్కో పిల్లర్ ఎత్తు 141 మీటర్లు కాగా దీన్ని జిరిబాం-తుపుల్-ఇంపాల్ మధ్య కొత్త బిజీ లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టు 111 కి.మీ మేర రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇజాయ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు.