199 ఉద్యోగాల భర్తీకి TIMS నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

TIMS Notification 2021: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.199 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టిమ్స్ డైరెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాల్లో భాగంగా పోస్టులన్నింటినీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం https://dme.telangana.gov.in/లో అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కూడా అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు- 199

మెడికల్ ఆఫీసర్- 94

ప్రొఫెసర్- 12

అసోసియేట్ ప్రొఫెసర్- 23

అసిస్టెంట్ ప్రొఫెసర్- 22

నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- 1

అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- 6

స్టాఫ్ నర్స్- 32

డైటీషియన్- 1

ఫార్మాసిస్ట్- 8

వాక్ ఇన్ ఇంటర్వ్యూ సమయం:

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్ పోస్టులకు: ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులకు: ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.

వయసు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు నిండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు.

ఇంటర్వ్యూ జరిగే స్థలం- తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా.